Health Insurance Benefits: ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిందే. మనుషుల ప్రాణాలకు లెక్కే లేదు. దీంతో ఆరోగ్య బీమా పాలసీలు చేయించుకోవాలి. చాలా మందికి ఆరోగ్య బీమాపై అవగాహన ఉండటం లేదు. వాస్తవానికి ఫిట్ నెస్, ఆరోగ్య బీమా ప్రీమియం మధ్య ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. దీనిపై చొరవ చూపితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. బీమా పాలసీలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. స్మోకింగ్ వంటి అనేక అంశాల ఆధారంగా బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తాయి. ఫిట్ గా ఉండటానికి వ్యాయామం, ఆహారం తీసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశముండదు. దీని కోసం అందరు ఫిట్ నెస్ ను ప్రధానంగా చూసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారు ఆరోగ్యంగా ఉంటేనే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
బీఎంఐని ప్రామాణికంగా తీసుకుంటోంది. దీని ఆధారంగా బరువుకు తగిన విధంగా శరీరం ఉంటేనే బీమా కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. అనారోగ్యంగా ఉన్న వారికి పాలసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. బీఎంఐ కాలిక్యులేటర్ సాయంతో ఆన్ లైన్ లో బీఎంఐ స్కోరును తనిఖీ చేసుకోవచ్చు. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారి విషయంలో బీమా కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులకు గురయిన వారికి కూడా బీమా కంపెనీలు పాలసీలు ఇవ్వడం లేదు. దీంతో మనం ఫిట్ నెస్ గా ఉంటేనే బీమా పాలసీ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వారికి మంచి లాభాలు దక్కుతాయి. రోగాల బారిన పడిన వారికి అవరోధాలు కలగనున్నాయని తెలుస్తోంది.