Secunderabad: నైటీలో వచ్చి చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

తాజాగా సికింద్రాబాద్ లోని ఎస్డీ రోడ్ లోని ఎమరాల్డ్ హౌస్ లో చోరీ జరిగింది. అక్కడే సెక్యూరిటీగా పనిచేసే వినయ్ మే 28న నైటీ వేసుకుని వచ్చి రూ.8.28 లక్షల విలువైన ఫోన్లు చోరీ చేశాడు. మొదట పోలీసులు అతడిని మహిళగానే భావించారు. కానీ అతడు ఆ రోజు సెలవు పెట్టడంతో అతడిపై అనుమానం వచ్చింది. ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది.

Written By: Srinivas, Updated On : June 1, 2023 9:34 am

Secunderabad

Follow us on

Secunderabad: దొంగతనాలు కొత్త రకంగా చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. కానీ దొరికిపోతున్నారు. అందరిని మోసం చేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో కొందరిని మోసం చేయొచ్చుకానీ అన్ని సందర్భాల్లో అందరిని మోసం చేయడం అంత సులువైన పని కాదు. ఇక్కడో ప్రబుద్ధుడు చేసిన చోరీ అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. కంచే చేను మేసినట్లు సెక్యూరిటీగా ఉండేవాడు దొంగగా మారితే ఎలా ఉంటుందో చూడండి.

తాజాగా సికింద్రాబాద్ లోని ఎస్డీ రోడ్ లోని ఎమరాల్డ్ హౌస్ లో చోరీ జరిగింది. అక్కడే సెక్యూరిటీగా పనిచేసే వినయ్ మే 28న నైటీ వేసుకుని వచ్చి రూ.8.28 లక్షల విలువైన ఫోన్లు చోరీ చేశాడు. మొదట పోలీసులు అతడిని మహిళగానే భావించారు. కానీ అతడు ఆ రోజు సెలవు పెట్టడంతో అతడిపై అనుమానం వచ్చింది. ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది.

అందరిని తప్పుదారి పట్టించేందుకు అతడు మహిళ వేషం వేసినా దొరికిపోయాడు. రక్షించేవాడే భక్షిస్తే ఎలా? కాపలా ఉండాల్సిన వాడే కసాయి వాడైతే ఇలాగే ఉంటుంది. దొంగతనం కోసం అతడు పన్నిన పన్నాగం తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంత దారుణానికి ఒడిగడతాడా? ఇన్నాళ్లు నమ్మకంగా ఉండే వాడే మోసానికి పాల్పడ్డాడా అని అందరు అవాక్కయ్యారు.

పోలీసులు అత్యంత చాకచక్యంగా కేసును చేధించారు. సెక్యూరిటీ గార్డుగా ఉంటూ దొంగతనం చేయాలని ఎలా అనిపించింది. నమ్మిన వారినే నట్టేట ముంచే పని చేయడం సమంజసం కాదు. వేరే ఎవరైనా వస్తే పట్టుకోవాల్సిన వాడే చోరీ చేయడం సంచలనం కలిగించింది. మొత్తానికి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల చర్యను అందరు ప్రశంసిస్తున్నారు.