Asaduddin Owaisi: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎంను ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ ఈసారి బలమైన అభ్యర్థి మాధవీలతను బరిలోకి దింపింది. పోరు హోరాహోరీగా సాగింది. కానీ ఫలితాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఘన విజయం సాధించారు. చివరి వరకు ఫలితం ఉత్కంఠగా సాగింది. ఒకానొక సమయంలో 33 వేల ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్‌కు ఓట్లకు కాస్త దగ్గరగా వచ్చారు మాధవీలత. కానీ చివరి రౌండులో అసదుద్దీన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
వరుసగా ఐదోసారి..
అసదద్దీన్ రాజకీయ నేపథ్యం చూస్తే.. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 1984 నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరు సార్లు ఈ స్థానంలో గెలుపొందారు. 1996లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బీజేపీ తరఫున పోటీ చేసి సలావుద్దీన్ చేతిలో 73 వేల ఓట్లతో ఓడిపోయారు. సలావుద్దీన్ ప్రస్థానం ముగిశాక 2004, 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి వరుసగా నాలుగుసార్లు అసద్ విజయం సాధించారు. 2024లో ఎప్పుడూ లేనంత టఫ్ ఫైట్‌ను ఎదుర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారు. చివరి వరకు హోరా హోరీగా సాగిన పోరులో మాధవీలతపై 2,97,031 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నాయకుడిగా రికార్డు సృష్టించారు.