మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

ప్రతిరోజూ మొలకలు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. గుడ్లు, చికెన్, మటన్, చేపల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఏ స్థాయిలో అందుతాయో మొలకలు తినడం ద్వారా కూడా అదే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మొలకలు తినేవాళ్లను పచ్చి మొలకలు తినడం మంచిదా..? లేక ఉడికించిన మొలకలను తినడం మంచిదా…? అనే సందేహం వేధిస్తూ ఉంటుంది. మొలకలు పచ్చివి తింటే జీర్ణం కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది […]

Written By: Navya, Updated On : February 28, 2021 7:59 pm
Follow us on

ప్రతిరోజూ మొలకలు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. గుడ్లు, చికెన్, మటన్, చేపల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఏ స్థాయిలో అందుతాయో మొలకలు తినడం ద్వారా కూడా అదే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మొలకలు తినేవాళ్లను పచ్చి మొలకలు తినడం మంచిదా..? లేక ఉడికించిన మొలకలను తినడం మంచిదా…? అనే సందేహం వేధిస్తూ ఉంటుంది.

మొలకలు పచ్చివి తింటే జీర్ణం కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఉడికించుకుని తీసుకుంటే మంచిది. ఉడికించిన మొలకలను తీసుకుంటే జీర్ణక్రియపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఉడికించిన ఆహారాలు సులభంగా జీర్ణం కావడంతో పాటు మన శరీరం సులభంగా పోషకాలను గ్రహించే అవకాశం ఉంటుంది. ఇతర సమయాలతో పోలిస్తే రాత్రి సమయంలో మొలకలను తీసుకుంటే మంచిది.

రాత్రి సమయంలో మొలకలు తీసుకుంటే బరువు పెరగకుండా అదుపులో ఉంచవచ్చు. చిన్న చిక్కుళ్ళు, మొలకలు సులువుగా జీర్ణమవుతాయి కాబట్టి రాత్రి సమయంలో వీటిని తీసుకుంటే మంచిది. వీటిని రోటీ లేదా అన్నంతో కలిపి కూడా తీసుకోవచ్చు. మొలకల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వయస్సుతో పని లేకుండా ఎవరైనా వీటిని సులభంగా తీసుకోవచ్చు.

మొలకలు తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మొలకలు కొన్ని తీసుకున్నా పొట్ట నిండిన భావన కలగడంతో పాటు హార్మోన్ల సమతుల్యత జరుగుతుంది. మొలకలు రకరకాల అలర్జీలను దూరం చేయడంలో తోడ్పడతాయి.