https://oktelugu.com/

ఒడిషా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాళ్లను పెళ్లి చేసుకుంటే రూ.2.5 లక్షలు..?

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రోత్సాహక నగదును భారీగా పెంచడంతో దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్ లను అమలు చేస్తుండగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మొత్తం ప్రోత్సాహకంగా ఇస్తుండటం గమనార్హం. అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వాళ్లు తక్కువగా ఉండగా దివ్యాంగులకు పెళ్లి జరగడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 28, 2021 / 07:56 PM IST
    Follow us on

    ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రోత్సాహక నగదును భారీగా పెంచడంతో దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్ లను అమలు చేస్తుండగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మొత్తం ప్రోత్సాహకంగా ఇస్తుండటం గమనార్హం.

    అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వాళ్లు తక్కువగా ఉండగా దివ్యాంగులకు పెళ్లి జరగడం కొంత కష్టంగా మారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉండగా ఆయా రాష్ట్రాల్లో 50,000 రూపాయలు మాత్రమే ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఏకంగా 5 రెట్లకు పెంచడం గమనార్హం.

    సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఈ ప్రోత్సాహకం అందుతుంది. అయితే ఈ పెళ్లిళ్లు కట్న రహితంగా జరగాలని ఒడిశా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. దేశంలోనే అత్యధిక నగదు ప్రోత్సాహకాన్ని చెల్లించే రాష్ట్రంగా ఒడిషా నిలవగా ఇతర రాష్ట్రాలు సైతం దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి ప్రోత్సాహకాలను పెంచుతారేమో చూడాల్సి ఉంది.

    పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దివ్యాంగులను ప్రోత్సహించడానికి వారికి ఆర్థిక సహకారం అందించడానికి పలు స్కీమ్ ల ను అమలు చేస్తున్నాయి. కొంతమంది సహృదయంతో అంగవైకల్యం ఉన్నా వారితో జీవితం పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. . ఇలాంటి వివాహాలను ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం.