https://oktelugu.com/

కోవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోడీ.. ఆయనకు వేసిన టీకా ఏదంటే?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొద్దిసేపటి క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులు.. 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు దేశంలో కరోనా టీకా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మోడీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. మోడీ స్వదేశీ కోవాగ్జిన్ తీసుకుంటారా? లేక విదేశీ తయారీ అయినా ఆక్స్ ఫర్డ్ టీకా ‘కోవీషీల్డ్’ తీసుకుంటారా? […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2021 / 08:52 AM IST
    Follow us on

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొద్దిసేపటి క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులు.. 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు దేశంలో కరోనా టీకా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు.

    ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మోడీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. మోడీ స్వదేశీ కోవాగ్జిన్ తీసుకుంటారా? లేక విదేశీ తయారీ అయినా ఆక్స్ ఫర్డ్ టీకా ‘కోవీషీల్డ్’ తీసుకుంటారా? అన్న ప్రశ్నలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ స్వదేశీ భారత్ లో తయారైన హైదరాబాదీ ‘భారత్ బయోటెక్’ కంపెనీ తయారు చేసిన ‘కోవాగ్జిన్’ టీకాను తీసుకున్నారు.

    తొలి డోసు వ్యాక్సిన్ ఇది. వైద్యరంగానికి సంబంధం లేని.. ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తింపు లేని ఓ రాజకీయ నాయకుడు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడం ఇదే తొలిసారి.

    స్వదేశీ వ్యాక్సిన్ తీసుకున్న మోడీ కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మోడీ ప్రజలకు పిలుపునిచ్చాడు.

    ఎయిమ్స్ లోని సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రధాని మోడీ తెల్లవారుజామునే ఎయిమ్స్ కు చేరుకున్నారు. నేరుగా వ్యాక్సినేషన్ విభాగానికి వెళ్లారు. ప్రధాని మెడలో ‘అస్సామీ సంస్కృతి’ కండువా వేసుకున్నారు.

    నిజానికి మోడీ వ్యాక్సిన్ వేయించుకునేది ఆయన షెడ్యూల్ చేయలేదని సమాచారం. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. కేవలం గంట ముందు మాత్రమే పీఎంఓ అధికారులు ఎయిమ్స్ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు.

    హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ను పుదుచ్చేరికి చెందిన నర్సు సిస్టర్ నివేద ప్రధానికి ఇచ్చారు. ఇంజెక్షన్ తీసుకున్నా మోడీ అక్కడే కొద్దిసేపు గడిపారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి చేస్తున్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చాడు.