Saree Cancer: భయపెడుతున్న చీర క్యాన్సర్.. జాగ్రత్త

భారతదేశంలోని స్త్రీలు ఎక్కువగా ధరించే వాటిలో ముఖ్యమైనది చీర. ఈ చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట. బీహార్, జార్ఖండ్ లలో చీర క్యాన్సర్ మొదలైందని తెలుస్తోంది.

Written By: Swathi, Updated On : April 3, 2024 11:39 am

Saree Cancer

Follow us on

Saree Cancer: ప్రస్తుతం ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో? ఎలాంటి వ్యాధులు శరీరాన్ని ఎటాక్ చేస్తాయో తెలుసుకోవడం కష్టమే. క్యాన్సర్స్, టీబీ, హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ లలో ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. లంగ్స్, స్కిన్, త్రోట్, బ్రెస్ట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వ్యాధి వస్తే కోలుకోవడం కష్టమే. అయితే రీసెంట్ గా చీర క్యాన్సర్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఇంతకీ ఈ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..

భారతదేశంలోని స్త్రీలు ఎక్కువగా ధరించే వాటిలో ముఖ్యమైనది చీర. ఈ చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట. బీహార్, జార్ఖండ్ లలో చీర క్యాన్సర్ మొదలైందని తెలుస్తోంది. దీన్ని వైద్య భాషలో స్క్వామల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారట. ముంబైలోని ఆర్ఎణ్ కూపర్ ఆస్పత్రిలో ఈ చీర క్యాన్సర్ పై పరిశోధనలు చేశారు. 68 సంవత్సరాల మహిళకు ఈ క్యాన్సర్ ఉన్నట్టు బాంబే హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

ఆ మహిళ 13 సంవత్సరాల నుంచి చీర కట్టుకుంటుందట. చాలా మంది స్త్రీలు చీరలు కట్టుకుంటారు. చీర కట్టుకోవడానికి పెట్టీకోట్ ను నడుముకు కాటన్ దారంతో గట్టిగా కట్టుకుంటారు. మహిళలు ఎక్కువ సేపు ఒకే వస్త్రాన్ని ధరించినప్పుడు నడుముపై రుద్దినట్టు అవుతుంటుంది. అక్కడ చర్మం దెబ్బతిని క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. సంప్రదాయంగా కట్టుకునే చీరల వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అని తెలిసి మహిళలు భయపడుతున్నారు. కానీ కాస్త జాగ్రత్త పడితే ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు నిపుణులు.