AP Pension Controversy: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వలంటీర్ల అంశం రచ్చ రచ్చ అవుతోంది. ఎన్నిలు ముగిసే వరకు వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించకుండా టీడీపీ వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వలంటీర్లు రెండు నెలల వరకు పింఛన్లు పంపిణీ చేయకుండా ఆదేశించింది. దీంతో రచ్చ మొదలైంది.
వలంటీర్లు అంతా చేస్తారని..
వలంటీర్లు వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు. దీంతో వీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని టీడీపీ భావిస్తోంది. వారిని కట్టడి చేయాలని మొదటి నుంచి భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వలంటీర్లకు చెక్ పెట్టేందు ఓ స్వచ్ఛంద సంస్థతో ఫిర్యాదు చేయించింది. ఇంకేముంది టీడీపీ వాదనతో ఏకీభవించిన ఈసీ వలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశించింది.
టీడీపీపై వైసీపీ ఫైర్..
వలంటీర్ల సేవలు నిలిపివేయడం వైసీపీకి కాస్త ఇబ్బందే. ఇంటింటికీ వెళ్లి ఒకటో తారీఖున పింఛన్లు అందించే వలంటీర్లు పింఛన్ల పంపిణీతోనే ఆగరని, వైసీపీ ఓటు వేయాలని లబ్ధిదారులను, వారి కుటుంబాలను కోరతారని టీడీపీ ఆలోచన. వైసీపీ కూడా వలంటీర్లతో లబ్ధి కలుగుతుందని భావించింది. కానీ, సేవలు ఆపివేయడంతో వైసీపీ టీడీపీ టార్గెట్‌గా విమర్వలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందకుండా చేసిందని ఆరోపిస్తోంది. వలంటీర్ల సేవలు నిలిపివేయడం ద్వారా కుట్ర పన్నిందని ప్రచారం చేస్తోంది.
తిప్పి కొడుతున్న టీడీపీ..
వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. కానీ, వైసీపీ ఆరోపణల ముందు అవి తేలిపోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఓ సమావేశంలో పింఛన్లు ఎలా ఆపించారో వివరించారు. ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలోనే తాము వలంటీర్లను పక్కకు పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఈసీ పట్టించుకోకపోవడంతో తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడ కూడా కాకపోవడంతో చివరకు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయించినట్లు వివరించారు. దీంతో వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
పెన్షన్ లు ఆపించింది మేమే అని ఒప్పుకున్న టీడీపీ pic.twitter.com/iha6VX9OQA
— TOVINO (@Vamos_Rafa23) April 2, 2024