Korean Head Spa: కొరియన్ హెడ్ స్పా అంటే ఏమిటి? దీనిని ఎలా చేస్తారంటే?

జుట్టు విషయంలో వీళ్లు ఉపయోగించే చిట్కాలు చాలా కొత్తగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కొరియన్ హెడ్‌ స్పా ఒకటి వైరల్ అవుతోంది. ఇలాంటి చిట్కాలు పాటించడమే కొరియన్ అమ్మాయిలు జుట్టు చూడటానికి చాలా బాగుంటుందని అంటున్నారు.

Written By: Kusuma Aggunna, Updated On : September 28, 2024 4:45 pm

Korean Head Spa

Follow us on

Korean Head Spa: ఇండియన్ అమ్మాయిలకి కొరియన్ అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఎక్కువగా కొరియన్ సిరీస్‌లు చూస్తుంటారు. కొరియన్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఇద్దరూ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఆరోగ్యం, అందం విషయంలో కొరియన్లు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అందుకే మిగతా దేశాలతో పోలిస్తే కొరియన్లు చాలా అందంగా ఉంటారు. వారి ముఖం కాంతివంతంగా ఎప్పుడూ మెరిసిపోతుంది. జుట్టు కూడా చాలా దృఢంగా మెరిసిపోతుంది. జుట్టు విషయంలో వీళ్లు ఉపయోగించే చిట్కాలు చాలా కొత్తగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కొరియన్ హెడ్‌ స్పా ఒకటి వైరల్ అవుతోంది. ఇలాంటి చిట్కాలు పాటించడమే కొరియన్ అమ్మాయిలు జుట్టు చూడటానికి చాలా బాగుంటుందని అంటున్నారు. ఇంతకీ హెడ్ స్పా ఏంటి? ఇది కొరియన్ స్టైల్‌లో ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా.. అలా అనుకుంటే అది మీ పొరపాటే. ఎందుకంటే కొరియన్ హెడ్ స్పా అంటే వాళ్ల స్టైల్‌లో ఉంటుంది. కానీ స్పాకి ఉపయోగించే వస్తువులు కొరియన్లలా ఉండటం కాదు. జుట్టు ఆరోగ్యంగా ఉంటూ బలంగా పెరిగేలా చేసేది కొరియన్ హెడ్ స్పా. మరి దీనిని ఎలా చేస్తారో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

కొరియన్ హెడ్ స్పా అంటే.. స్కాల్ప్‌కి ఆయిల్ పెట్టడం, మసాజ్ చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌కి అంటుకున్న మలినాలు తొలగిపోతాయి. రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు నాణ్యత పెరుగుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అయితే ఈ కొరియన్ హెడ్ స్పాలో ఆయిల్ వంటివి కాకుండా గ్రీన్ టీ, మగ్‌వోర్ట్, జిన్సెంగ్ వంటి కొరియన్ పదార్థాలను ఉపయోగిస్తారు. సహజ సిద్ధమైన వీటిని వాడటం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. తలపై ఉండే చుండ్రు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇది అన్ని రకాల చర్మం వారికి సెట్ కాదు. ఈ కొరియన్ హెడ్ స్పా చేసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యుడు ఎలాంటి సమస్య మీ చర్మానికి రాదని చెబితేనే కొరియన్ హెడ్ స్పా చేయించుకోండి. లేకపోతే దూరంగా ఉండటం మంచిది.

ఈ హెడ్ స్పా చేసే ముందు కురులను షాంపూతో మసాజ్ చేస్తారు. దీంతో జుట్టుని మురికి అంతా బయటకు పోతుంది. ఆ తర్వాత స్కాల్ప్‌ను నెమ్మదిగా మసాజ్ చేస్తారు. దీంతో ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి. కాస్త రిలీఫ్ అయిన తర్వాత స్కాల్ప్‌కి మాస్క్, సీరమ్ వాడుతారు. ఇవి జుట్టు కుదుళ్ల నుంచి బలంగా అయ్యేలా చేస్తాయి. వీటిని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల బలంగా తయారవుతుంది. బలహీనంగా ఉన్న జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది. అప్పుడప్పుడు ఈ కొరియన్ హెడ్ స్పా చేయించుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. మరి మీరు ఎప్పుడైనా ఈ హెడ్ స్పా చేయించుకున్నారో లేదో కామెంట్ చేయండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.