Relationship: భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఖర్చు వెచ్చించి మరి ఘనంగా పెళ్లి చేస్తారు. జీవితాంతం ఇద్దరూ సంతోషంగా ఉండాలని పెద్దలు పెళ్లి చేస్తాయి. అయితే పెళ్లయిన కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకోలేక కాస్త దూరంగా ఉంటారు. కానీ ఇలా ఉండటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పెళ్లయిన మొదటి ఏడాది భార్యాభర్తలకు చాలా కీలకం. ఎందుకంటే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటే వారి బంధం అంత బలపడుతుంది. పెళ్లయిన కొత్తలో మోహమాటానికి పోయి.. దూరంగా ఉండవద్దు. ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బాండ్ ఇంకా పెరిగి సంతోషంగా ఉంటారు. భాగస్వామికి ఏం అంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, అయిష్టాలు ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత సమయం వాళ్లతో సమయం గడపాలి. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవాలి. చిన్న విషయాలకి వారిపై చిరాకు పడకండి. ఏ విషయాన్ని అయిన ప్రేమతో మాట్లాడండి. వాళ్లకి నచ్చిన పని చేసేలా సపోర్ట్ చేయండి. ఎక్కువ సమయం భాగస్వామితో గడపడం వల్ల ఎలా ఉంటారో మీకు ఒక ఐడియా వస్తుంది.
భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అన్ని విషయాలు భాగస్వామితో చెప్పడం అలవాటు చేసుకోండి. చెబితే ఏం అనుకుంటారో అని మోహమాట పడకుండా అన్ని విషయాలు పంచుకోండి. సంతోషాలను మాత్రమే కాకుండా కష్టాలను కూడా పంచుకోవడం వల్ల ఇద్దరి బంధం ఎన్ని ఏళ్లు అయిన బలంగా ఉంటుంది. కొందరు భాగస్వామి బాధపడవద్దని చిన్న విషయాలను దాచేస్తుంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. తప్పు ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చి దూరం పెరుగుతుంది. కాబట్టి చిన్న విషయాలను భాగస్వామి వద్ద దాచవద్దు. భాగస్వామికి అర్థం అయ్యే విధంగా అన్ని విషయాలు చెప్పాలి. వర్క్ బిజీలో ఉండి భాగస్వామిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత బిజీగా ఉన్నా కూడా సమయం ఇవ్వాలి. భాగస్వామిని భారంగా కాకుండా బాధ్యతగా భావించాలి. చిన్న గొడవలు వచ్చి భార్యాభర్తల మధ్య దూరం పెరిగితే ఎవరో ఒకరు తగ్గాలి. బంధంలో చిన్ని అలకలు అనేవి సహజం. కాబట్టి ఈగో చూపించకుండా భాగస్వామిని అర్థం చేసుకోవాలి.
బంధంలో ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించాలి. అప్పుడే బంధం బలపడుతుంది. కొందరు పంతాలకు పోయి నేను ఎందుకు తనకి నచ్చనట్లు ఉండాలి. నాకు నచ్చినట్లు ఉంటానని అనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఇలా ఉంటే కాస్త కష్టమే. కాబట్టి పెళ్లయిన తర్వాత ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవాలి. భాగస్వామి ఏదైనా చేస్తే సపోర్ట్ చేయాలి. అప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి మెలసి ఉండాలి. అందరికి ప్రాధాన్యత ఇస్తూ.. వాళ్లతో కలిసి ఉండటం, బయటకు వెళ్లడం వంటివి చేస్తే.. కుటుంబ సభ్యులతో బంధం దృఢంగా మారుతుంది. పెళ్లయిన మొదటి ఏడాది భార్యాభర్తలు ఈ పద్ధతులు పాటిస్తుండాలి. అప్పుడే వాళ్ల బంధం జీవితాంతం సంతోషంగా ఉంటారు.