Term Life Insurance: ఏదైనా చిన్న వస్తువు కొంటే దానికి వారంటీ, గ్యారెంటీ ఉందా? లేదా? అని అడుగుతాం. కనీసం రూ.10 రూపాయల వస్తువు కొన్ని మంచిదేనా? కాదా? అని చెక్ చేసి మరి కొంటాం. డబ్బులు లేకపోతే దానికి లోన్ పెట్టి, ఈఎమ్‌ఐలు పెట్టి కొంటారు. వీటిన్నింటికి ప్రతి నెలా సరిగ్గా డబ్బులు చెల్లిస్తారు. కానీ మనిషికి మాత్రం ఎలాంటి గ్యారెంటీ ఉండదు. అకస్మాత్తుగా ఏదైనా అయితే ఆ కుటుంబ మొత్తం రోడ్డున పడుతుంది. దీంతో వాళ్ల లైఫ్ అంతా తలకిందులుగా మారిపోతుంది. ఇలాంటి సమయాల్లో కుటుంబానికి ఆర్థికంగా తోడు ఉండేది ఇన్సూరెన్స్‌లు మాత్రమే. ఇవి తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా ఏదైనా సమస్య వచ్చి చనిపోతే ఆ ఇన్సూరెన్స్‌లు బాగా ఉపయోగపడతాయి. అయితే మన దేశంలో ఎన్నో ఇన్సూరెన్సులు ఉన్నాయి. కానీ ఎవరూ వీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. దేశంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే ఇన్సురెన్సూలు ఉన్నాయి. మిగతా వారంతా అసలు ఒక్క ఇన్సురెన్సులు కూడా తీసుకోవడం లేదు. ఒక మొబైల్ కొంటే దానికి ఇన్సురెన్స్ తీసుకుంటారు. కానీ మనిషికి తీసుకోరు. ఇలా తీసుకోకపోవడం వల్ల వారికి సడెన్‌గా ఏదైనా అయితే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలి.
మనదేశంలో ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్‌లు అంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ రెండింటిని తప్పకుండా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా ఏదైనా అయితే కుటంబానికి ఆర్థికంగా తోడు ఉంటుంది. అయితే ఇవన్నింటికి కట్టడానికి ఎక్కువ డబ్బులు ఏం అక్కర్లేదు. నెలకు 500 రూపాయల నుంచి కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. మీ బడ్జెట్ బట్టి ప్రతి నెల ఇలా కట్టడం వల్ల ఎప్పుడైనా ఏదైనా అయితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది. వీటితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్‌లు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొంతవరకు చికిత్స కల్పిస్తుంది. కాబట్టి ప్రతి నెల మీకు నచ్చిన అమౌంట్‌తో ఇన్సూరెన్స్ కట్టడం వల్ల కుటుంబానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఆఫీసులకు వెళ్లాలని లేదు. ఆన్‌లైన్‌లో చాలా కంపెనీలు ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి.
పాలసీ బజార్‌లో చాలా రకాల టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. వీటిని చూసి మీరు పాలసీ బజార్‌లో లాగిన్ అయితే వాళ్లే మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు అర్థం కాకపోతే పూర్తిగా వాటి గురించి వివరిస్తారు. మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వీటివల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిన కుటుంబ సభ్యులకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు పిల్లలకు చిన్నప్పుడే ఇలా తీసుకోవడం వల్ల వాళ్ల చదువులకు, పెళ్లిళ్లకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవడం మేలు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఉపయోగపడతాయి. ఈరోజుల్లో ఎవరూ ఎప్పుడూ సడెన్‌గా చనిపోతున్నారో తెలియడం లేదు. ఇలా సడెన్‌గా ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడతే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స తీసుకోవడం మంచిది.