https://oktelugu.com/

Massage: అరికాళ్లను మసాజ్ చేసుకుంటే ఏం అవుతుంది అంటే..

అరికాళ్లను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె సమస్యలతో బాధపడేవారికి అరికాళ్ల మసాజ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 13, 2024 / 01:40 PM IST

    Massage

    Follow us on

    Massage: మసాజ్ చేసుకంటే బాడీకి చాలా రిలాక్స్ అనిపిస్తుంటుంది. కొందరు ఈ రిలాక్స్ కోసం ఇంట్లో కాదు ఏకంగా మాసాజ్ సెంటర్లకు క్యూ కడుతుంటారు. ఒత్తిడికి గురైన శరీరానికి రిలాక్స్‌ కావడానికి ఉపయోగపడుతుంది. అయితే వీటన్నింటితో పాటు అరికాళ్లను మసాజ్‌ చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ముఖ్యంగా రాత్రి పడుకునే ముందకు ప్రతీ రోజూ అరికాళ్లను మసాజ్‌ చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మరి అరికాళ్లను మసాజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? అయితే లుక్ వేయండి.

    అరికాళ్లను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె సమస్యలతో బాధపడేవారికి అరికాళ్ల మసాజ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

    అరికాళ్ల మసాజ్‌తో కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకుంటే మరీ మంచిది. ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

    రోజూ పడుకునే ముందు అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మసాజ్ శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో మంచి నిద్ర సొంతం చేసుకోవచ్చు.

    మీకు నెలసరి సమయంలో ఎక్కువ కడుపు నొప్పి వచ్చినా ఈ మసాజ్ వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. తిమ్మరి వంటి సమస్య ఉన్నా సరే అరికాళ్లతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.