ICMR : మానవ శరీరానికి నీరు ఎంతో అవసరం. ప్రతీ దేశంలో 70 శాతం నీరు ఉంటుంది. ఇది తగ్గినప్పుడల్లా దాహం వేస్తుంది. కానీ చాలా మంది నీరును తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. దీంతో సరైన సమయానికికావల్సినంత నీరు తాగకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు నీటిని తాగుతూ ఉండాలి. అయితే ఈమధ్య కాలంలో కొందరు నిల్చొని నీరు తాగకూడదని, కూర్చోని మాత్రమే నీరు తాగాలని అంటున్నారు. దీంతో చాలామందికి ఇది సందేహంగా మారింది. కొన్ని ప్రదేశాల్లో కూర్చొని నీరు తాగడం సాధ్యం కాదు. మరి నిల్చుని నీరు తాగడం వల్ల ప్రమాదం ఉందా? ఆరోగ్య సంస్థలు ఏం చెబుతున్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..
తిన్న ఆహారం జీర్ణం కావడానికి నీరు ఎంతో సహాయం చేస్తుంది. అందువల్ల తప్పనిసరిగా నీటిని తీసుకోవాలి. అయితే కొందరు ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే నీరు తాగుతారు. ఆ తరువాత నీటి గురించి పట్టించుకోరు. కానీ మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉండాలి. పని ప్రదేశాల్లో , బయటకు వెళ్లినప్పుడు సైతం నీటిని తీసుకుంటూ ఉండాలి. కానీ ఒక్కోసారి కూర్చొని నీరు తాగడం సాధ్యం కాదు. దీంతో నిల్చొని నీరు తాగాల్సి వస్తుంది. మరి ఇలా తాగినే అనారోగ్యానికి గురవుతారా?
ఈ విషయంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ క్లారిటీ ఇచ్చింది. తాగునీటికి సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించింది. నిలబడి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని తెలిపింది. నిలబడి నీరు తాగడం వల్ల కొందరు మొకాళ్ల నొప్పులు వస్తాయని చెబుతున్నారని, దానిపై ఎక్కడా పరిశోధన జరగలేదని, అది నిర్దారణ లేని విషయం అని తెలిపింది. అందువల్ల ఎటువంటి అపోహాలు పెట్టుకోకుండా నీటిని తరుచూ తీసుకుంటూ ఉండాలని తెలుపుతుంది.
ప్రతీరోజూ తప్పనిసరిగా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాని కొందరు ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ ప్రకారం ఈ మోతాదు తగ్గిదే బాడీ డీ హైడ్రేట్ అయ్యే సమస్య ఉంటుందని అన్నారు. వేసవి కాలంలో ఇంకా ఎక్కువే తీసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. తరుచూ నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని అన్నారు.