CBSE 12th Result: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను బోర్డు cbse.gov.in, https//cbseresults.nic.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ సైట్లను ఓపెన్ చేసి విద్యార్థులు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌లలో కూడా రిజల్ట్ పొందవచ్చు.
87..98 శాతం ఉత్తీర్ణత..
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికలు 91.52 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురుల్లో 85.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 1.16 లక్షల మంది విద్యార్థులు 90 శాతంపైగా మార్కులు సాధించడం విశేషం. ఇందులో 24,068 మంది 95 శాతానికిపైగా స్కోర్ చేశారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91 శాతం విజయవాడ 99.04 శాతం, చెన్నైలో 98.47 శాతం, బెంగళూర్‌లో 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫిబ్రవరిలో పరీక్షలు..
ఇదిలా ఉండగా సీబీఎస్‌ఈ 12వ తరగతి వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్ గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాలను ప్రకటించడం లేదు. కేవలం ఉత్తీర్ణత శాతాన్ని మాత్రమే ప్రకటిస్తోంది.