ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

జంతువులలో కల్ల ఏనుగు అతి పెద్ద జంతువు. ఏనుగును శక్తికి ప్రతీకగా భావిస్తుంటారు. అలాంటి అందమైన ఏనుగు బొమ్మలను కొందరు తమ ఇళ్లలో అలంకరణ వస్తువులుగా పెట్టుకుంటారు.అయితే కొందరు ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? అనే అనుమానాలు కలుగుతుంటాయి. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం… సాధారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లల్లోకి ఎన్నో సమస్యలు కలిగి ఉంటాయి.ఇటువంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఇంట్లో ఏనుగు విగ్రహం […]

Written By: Kusuma Aggunna, Updated On : January 10, 2021 11:31 am
Follow us on


జంతువులలో కల్ల ఏనుగు అతి పెద్ద జంతువు. ఏనుగును శక్తికి ప్రతీకగా భావిస్తుంటారు. అలాంటి అందమైన ఏనుగు బొమ్మలను కొందరు తమ ఇళ్లలో అలంకరణ వస్తువులుగా పెట్టుకుంటారు.అయితే కొందరు ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? అనే అనుమానాలు కలుగుతుంటాయి. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లల్లోకి ఎన్నో సమస్యలు కలిగి ఉంటాయి.ఇటువంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఇంట్లో ఏనుగు విగ్రహం కచ్చితంగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా మన పురాణాల ప్రకారం ఏనుగును ఒక దైవంగా భావిస్తారు. అటువంటి ఏనుగు ఆహారం పెట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

వినాయకుడికి ఏనుగు తలను తెచ్చి పెట్టడం వల్ల ఏనుగుకు మరింత ప్రాముఖ్యత చోటుచేసుకుందని చెప్పవచ్చు. వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. విగ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించి ఐశ్వర్యాన్ని కలిగిస్తాడని అర్థం. అటువంటి ఏనుగును మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.అంతే కాకుండా మన ఇంటి సింహ ద్వారం ముందు ఏనుగు తొండం పైకి పెట్టుకొని ఉన్న విగ్రహాలు ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తొలగించి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తాయి.ఏనుగు విగ్రహాలను ఉత్తర దిశలో పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ ఏనుగు విగ్రహాలను మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.