https://oktelugu.com/

ఫైనల్: ఏపీలో 26 కొత్త జిల్లాలు ఇవే..

ఏపీ రూపు మార్చేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వేసిన ఉన్నతస్థాయి కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపదికగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. Also Read: సీఎం జగన్ కు పవన్ సూటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ నియోజకవర్గాలన్నీ ఒక్కో కొత్త జిల్లాగా మారుతాయి. దీని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2021 / 08:53 AM IST
    Follow us on

    ఏపీ రూపు మార్చేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వేసిన ఉన్నతస్థాయి కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపదికగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

    Also Read: సీఎం జగన్ కు పవన్ సూటి ప్రశ్నలు

    ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ నియోజకవర్గాలన్నీ ఒక్కో కొత్త జిల్లాగా మారుతాయి. దీని ప్రకారం.. అరకులో ఒకటి అదనంగా జిల్లాగా మారనుంది. ఏపీలోని 25 ఎంపీ సీట్లతో పాటు అరకులో పాడేరు, పార్వతీపురంలు ఒకటి అదనంగా జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 26 జిల్లాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సిద్ధమైంది.

    ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కమిటీ ప్రతిపాదించింది. జిల్లాలో ఏర్పాటులో పెద్ద ఆటంకంగా ఉన్న అరకు లోక్ సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు చేయాలని సూచనలు చేసింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న మూడింటిని రద్దు చేయాలని నివేదికలో పేర్కొన్నారు.

    Also Read: గుడ్ న్యూస్: దేశంలో కరోనా టీకాల పంపిణీ ఇప్పటినుంచే..

    అన్ని అంశాలు, అభిప్రాయాలు సేకరించిన అనంతరం కొత్త జిల్లాలు, ముఖ్య కేంద్రం, వాటి పరిధిలో రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలతో కమిటీ నివేదికను రూపొందించింది. ప్రతిజిల్లాలో రెండు నుంచి మూడు డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.

    ఇక కొత్త జిల్లాలతోపాటు కొత్త పోలీసు జిల్లాల హద్దులపై కూడా ఆ శాఖ కసరత్తు చేస్తోంది. విద్యా, ఆరోగ్యం, అటవీ, కమర్షియల్ ట్యాక్సులు, ఇంజినీరింగ్ తదితర శాఖలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్