Eyes Health: అన్ని అవయవాల కంటే కళ్లు ప్రదానం. కళ్లు లేకపోతే లోకాన్ని చూడలేం. మనిషి శరీరంలో అన్ని అవయవాల కంటే కళ్లకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ఎందుకంటే కళ్లు చూస్తేనే కదా మనం లోకాన్ని చూసేది. అదే కళ్లు లేకపోతే గుడ్డివాడిగా ఉండిపోవాల్సి వస్తుంది. కంటి చూపు లేకపోతే అంత చీకటిగా ఉంటుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఆరోగ్యం దెబ్బతిని గుడ్డివాడిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
కంటి చూపు ఎందుకు పోతుంది
విటమిన్ ఎ లోపం వల్ల కంటి చూపు మందగిస్తుంది. విటమిన్ ఎ రెటీనాలో వ్యర్థాలను దూరం చేస్తుంది. మొక్కల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఇవి తీసుకోవడం మంచిది. తోటకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా తోటకూర తినాలి. ఇది పేగుల్లోని బీటా కెరోటిన్, విటమిన్ ఎ లభించేందుకు కారణమవుతుంది. గుడ్డు, క్యారెట్, ఆకుకూరలు, చేపనూనె, టమాట, విటమిన్ సి ఉండే పండ్లలో కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ సి ఉండే పండ్లు
నిమ్మజాతికి చెందిన పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ప్రధానమైనవి నిమ్మ, నారింజ. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవడం తప్పనిసరి. కళ్లను రక్షించుకోవాలంటే జామ, ఆపిల్, ద్రాక్ష, బ్లాక్ బెర్రీ, కమల జాతి పండ్లు తీసుకోవడం ఉత్తమం. వీటితో మన కంటి జబ్బులు రాకుండా పోతాయి.
విటమిన్ ఇ ఉండే పండ్లు
కళ్లు సురక్షితంగా ఉండాలంటే విటమిన్ ఇ ఉండే పండ్లు కూడా తీసుకోవాలి. ఇందులో గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, మాంసం, నట్స్ ఉన్నాయి. వీటిని తినడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మన కళ్లకు జబ్బులు రాకుండా ఉంటాయి. బాదం, పొద్దుతిరుగుడు, బీన్స్, చిక్ పీస్, తృణ ధాన్యాలు, గుమ్మడి గింజలు వంటివి కూడా తీసుకోవడం మంచిది. ఇలా మన ఆహారాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే కళ్ల జబ్బులు రాకుండా పోతాయి.