Pooja Hegde: ఓ నాలుగేళ్లు పూజా హెగ్డేకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. పట్టిందల్లా బంగారం అయ్యింది. అరవింద సమేత వీరరాఘవతో మొదలైన విజయాల పరంపర ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వరకు కొనసాగింది. రాధే శ్యామ్ మూవీతో బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. బీస్ట్ మినహాయిస్తే అన్నీ డిజాస్టర్స్. విజయ్ నటించిన బీస్ట్ మాత్రం తక్కువ నష్టాలతో బయటపడింది.
దానికి తోడు ఒప్పుకున్న చిత్రాలు కూడా వెనక్కిపోతున్నాయి. విజయ్ దేవరకొండకు జంటగా జనగణమన చిత్రం చేయాల్సింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మొదలైన ఆ మూవీ మధ్యలో ఆగిపోయింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యాక నిర్మాతలు తప్పుకున్నారు. లైగర్ డిజాస్టర్ ఎఫెక్ట్ జనగణమన మీద పడింది. ఆ సినిమా ఆగిపోవడం వల్ల పూజా హెగ్డేకు ఐదు కోట్లు నష్టం.
తాజాగా గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్ట్ చేజారింది. పాపం త్రివిక్రమ్ పూజా హెగ్డేను దారుణంగా మోసం చేశాడు. మెయిన్ హీరోయిన్ అని చెప్పి షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హీరోయిన్ చేశాడు. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ చేశాడు. ఆ దెబ్బతో మైండ్ బ్లాక్ అయిన పూజా హెగ్డే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. జనగణమన, గుంటూరు కారం ప్రాజెక్ట్స్ ద్వారా కనీసం పది కోట్లు పూజా సంపాదించుకునేది. ఉస్తాద్ భగత్ సింగ్ లో మొదట హీరోయిన్ గా పూజా అనుకున్నారు. ఆ ఛాన్స్ శ్రీలీల తన్నుకుపోయింది.
ఫేడ్ అవుట్ దశలో పది కోట్లు అంటే మాటలు కాదు కదా. ప్రస్తుతం తెలుగులో అమ్మడు చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అక్కడ ప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ నడుపుతుందంటూ వార్తలు వచ్చాయి. మరి అదే జరిగితే పూజా హెగ్డే కెరీర్ సెట్. సల్మాన్ తనకున్న పరిచయాలతో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఇప్పిస్తారు. కెరీర్ ఇలా ఉంటే సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటో షూట్స్ కి తెరలేపుతుంది. పూజ లేటెస్ట్ లుక్ టెంప్టింగ్ గా ఉంది. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram