మైగ్రేన్ తలనొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివే..?

ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది మైగ్రేన్ తలనొప్పి బారిన పడుతున్నారు. సాధారణ తలనొప్పికి మైగ్రేన్ తలనొప్పికి లక్షణాల్లో తేడా ఉంటుంది. తలలో ఒకవైపు మాత్రమే భరించలేనంత నొప్పి వస్తూ ఉండటం వల్ల మనం నిత్యం చేసే పనులకు సైతం ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. ట్యాబ్లెట్లు వాడటం వల్ల తాత్కాలికంగా పరిష్కారం లభించినా మళ్లీ ఆ సమస్య కొంతమందిని వేధిస్తూ ఉంటుంది. Also Read: మధుమేహ రోగులు శనగలు తినవచ్చా..? తినకూడదా..? యువకులతో పోల్చి చూస్తే […]

Written By: Navya, Updated On : December 7, 2020 12:33 pm
Follow us on


ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది మైగ్రేన్ తలనొప్పి బారిన పడుతున్నారు. సాధారణ తలనొప్పికి మైగ్రేన్ తలనొప్పికి లక్షణాల్లో తేడా ఉంటుంది. తలలో ఒకవైపు మాత్రమే భరించలేనంత నొప్పి వస్తూ ఉండటం వల్ల మనం నిత్యం చేసే పనులకు సైతం ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. ట్యాబ్లెట్లు వాడటం వల్ల తాత్కాలికంగా పరిష్కారం లభించినా మళ్లీ ఆ సమస్య కొంతమందిని వేధిస్తూ ఉంటుంది.

Also Read: మధుమేహ రోగులు శనగలు తినవచ్చా..? తినకూడదా..?

యువకులతో పోల్చి చూస్తే యువతులు మైగ్రేన్ తలనొప్పి బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. సాధారణంగా విడుదల కావాల్సిన రసాయనాల కంటే ఎక్కువ మోతాదులో తలలో రసాయనాలు విడుదలైతే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ సమస్య బారిన పడటానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పి వస్తే మొదట ఆ సమస్యకు కారణాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.

Also Read: ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

ఐస్ ప్యాక్ సహాయంతో మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు. తలకు ఐస్ ప్యాక్ ను పట్టిస్తే రక్తం సరఫరా సరిగ్గా జరిగి సమస్య తగ్గుముఖం పడుతుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధ పడే వారు కాఫీ తాగడం వల్ల కూడా ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. సువాసనలు ఉన్న నూనెలను తలకు పట్టించడం ద్వారా కూడా మైగ్రేన్ సమస్య దూరమవుతుంది. కొందరికి మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ సమస్య వస్తుంది.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా కూడా మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పాదాలను చల్లని నీటిలో ఉంచి గోరువెచ్చని నీరు నింపిన బాటిల్ ను తల వెనుక భాగంలో పెట్టుకోవడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.