మనలో చాలామంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు సైతం మందులను వినియోగిస్తూ ఉంటారు. అయితే చాలా వ్యాధులకు పృకృతి నుంచి లభించే ఔషధ మొక్కల ద్వారా సులభంగా చెక్ పెట్టవచ్చు. మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. అయితే ఆ మొక్కల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలియకపోవడం వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం. అలా మనకు సులభంగా లభ్యమయ్యే మొక్కల్లో తిప్పతీగ ఒకటి.
ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడం కొరకు చాలామంది తిప్పతీగను వినియోగిస్తారు. బహువార్షిక లలజాతికి చెందిన తిప్పతీగ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తిప్పతీగ ఆకుల చూర్ణం ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సహాయపడుతుంది. రోజూ తిప్పతీగ ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల జ్వరాల, ఇన్‌ఫెక్షన్ల బారిన తక్కువగా పడతాం. తిప్పతీగలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి.
బెల్లంతో ఈ ఆకుల పొడిని కలుపుకుని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడటంతో పాటు అజీర్తి సమస్య తగ్గుతుంది. మధుమేహ రోగులు తిప్పతీగ చూర్ణం రోజూ తీసుకోవడం ద్వారా సులభంగా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మానసిక సమస్యలు, ఒత్తిడితో బాధపడే వాళ్లు తిప్పతీగ చూర్ణం తీసుకోవడం ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
జలుబు, దగ్గు, టాన్సిల్స్ లాంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో తిప్పతీగ సహాయపడుతుంది. తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి గోరువెచ్చని పాలలో తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం తిప్పతీగను ధృవీకరించడం గమనార్హం.