https://oktelugu.com/

భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి ధర పతనం…?

గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ల గురించి వరుసగా వెలువడుతున్న శుభవార్తలు పసిడి ధరకు బ్రేకులు వేశాయి. బంగారం ధర 220 రూపాయలు తగ్గగా వెండి ధర ఏకంగా 3,000 రూపాయలు తగ్గడం గమనార్హం. ఈ మధ్య కాలంలో వెండి ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. Also Read: ‘నాగార్జున్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2020 / 08:38 AM IST
    Follow us on


    గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ల గురించి వరుసగా వెలువడుతున్న శుభవార్తలు పసిడి ధరకు బ్రేకులు వేశాయి. బంగారం ధర 220 రూపాయలు తగ్గగా వెండి ధర ఏకంగా 3,000 రూపాయలు తగ్గడం గమనార్హం. ఈ మధ్య కాలంలో వెండి ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.

    Also Read: ‘నాగార్జున్ సాగర్’పై గులాబీ బాస్ ఫోకస్.. నిఘా వర్గాలతో ఆరా..!

    హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే 220 రూపాయల తగ్గుదలతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,080 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల క్షీణతతో 45,910 రూపాయలుగా ఉంది. బంగారం ధర అంతకంతకూ తగ్గుతుండడంతో పసిడి కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలకు సైతం ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి.

    Also Read: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఎలా యాక్టివేట్ చేయాలంటే..?

    నిన్నటివరకు కిలో వెండి 67,000 రూపాయలకు పైగా పలకగా ఏకంగా 3,619 రూపాయలు తగ్గడంతో ధర 63,900 రూపాయలకు చేరింది. డిమాండ్ రోజురోజుకు తగ్గుతుండటం వల్లే వెండి ధర పతనమైనట్లు తెలుస్తోంది. అయితే దేశీయ మార్కెట్ లో బంగారం ధర క్రమంగా తగ్గుతుండగా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పరుగులు తీస్తోంది. ఔన్స్ బంగారం ధర ఏకంగా 0.08 శాతం పెరిగింది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఏకంగా 1841 డాలర్లకు చేరడం గమనార్హం. దేశీయ మార్కెట్ లో వెండి ధర పతనమైనా అంతర్జాకీయ మార్కెట్ లో మాత్రం 0.20 శాతం పెరుగుదలతో 24.30 డాలర్లకు చేరింది.