https://oktelugu.com/

కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. కోలుకున్నా ఆ సమస్యలు..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కొత్త కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా రికవరీ కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ తగ్గుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లను మరో ఆరోగ్య సమస్య వేధిస్తోందని గుర్తించారు. Also Read: 24 గంటల్లో కరోనా వైరస్ కు చెక్.. వెలుగులోకి కొత్త ఔషధం..? కరోనా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2020 / 08:12 AM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కొత్త కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా రికవరీ కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ తగ్గుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లను మరో ఆరోగ్య సమస్య వేధిస్తోందని గుర్తించారు.

    Also Read: 24 గంటల్లో కరోనా వైరస్ కు చెక్.. వెలుగులోకి కొత్త ఔషధం..?

    కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని తేలగా కోలుకున్న వాళ్లలో చాలామందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు కాంగ్రెస్ ఆఫ్ ది యూరోపియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అండ్ వెనెరియాలజీలో కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో లాంగ్ హాలర్స్ అనే చర్మ సమస్యను తాము గుర్తించామని వెల్లడించారు.

    Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?

    ఈ సంవత్సరం జూన్ నెల నుంచి ఆగష్టు నెల మధ్యలో కరోనా బారిన పడి కోలుకున్న వారిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా బారిన పడి ఎక్కువ రోజులు పోరాడిన వాళ్లలో సమస్యలు వస్తున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 1000 మందిలో 224 మంది ఈ సమస్యతో బాధ పడుతున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా వెల్లడించారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    కొందరు కరోనా రోగుల్లో కాళ్లు, చేతులు వాచాయని మరి కొందరు రోగుల్లో శరీరంపై దద్దుర్లు కనిపించాయని.. కొందరిలో కరోనా సోకిన వెంటనే చర్మ సంబంధిత సమస్యలు కనిపించగా ఆ సమస్యలు దీర్ఘకాలం కొనసాగాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.