మనలో కొంతమంది చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వల్ల జుట్టుకు రంగు వేస్తూ ఉంటారు. తెల్ల జుట్టు ఉంటే పెద్దవాళ్లలా కనిపిస్తామని భావించి చాలామంది జుట్టుకు రంగు వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే హెయిర్ డై వేసుకోవడం మంచిదేనా..? అంటే మాత్రం కాదనే చెప్పాలి. తలకు తరచూ రంగు వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
Also Read: రాత్రి భోజనం తరువాత అరటిపండు తినవచ్చా..? తినకూడదా..?
హెయిర్ డై వేసుకోవడంలో తప్పేం లేకపోయినా హెయిర్ డైలో ఉండే కెమికల్స్ కొన్నిసార్లు సరిపడకపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కళ్లు మంట పెట్టడం, పెదాలు వాచిపోవడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. హెయిర్ డైని వాడే ముందు అది మన శరీరతత్వానికి సరిపడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. గోళ్లకు హెయిర్ డై ఎట్టి పరిస్థితుల్లోనూ అంటనివ్వకూడదు. గోళ్లకు అంటుకుంటే ఆ రంగు చర్మంపై తొలగిపోయినట్లుగా పోదు.
Also Read: కంటిచూపు మందగించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
హెయిర్ డైలో కంటికి హాని చేసే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల హెయిర్ డై వేసుకునే సమయంలో కంటి విషయంలో అదనపు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. హెయిర్ డైలో కోల్ తార్, పీపీడీ ఉంటే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల హెయిర్ డైల కంటే అప్పటికప్పుడు కలుపుకున్న హెన్నా, కాలీ మెహందీ జుట్టుకు వేసుకోవడం మంచిది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
హెయిర్ డై వేసుకునే ముందు చెవి వెనుక రంగు కొంచెం వేసి రెండు రోజుల పాటు పరిశీలించాలి. అలా చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోతే ఆ హెయిర్ డైని వినియోగించవచ్చు. రంగు వేసుకునే సమయంలో చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. గర్భిణులు ప్రెగ్నెన్సీ సమయంలో హెయిర్ డైలను వినియోగించకూడదు.