ఆంధ్రప్రదేశ్లో త్వరలో మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు మారుతారో, ఎవరు ఉంటారో తెలియక మంత్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇద్దరు మంత్రులు మాత్రం తమ పదవి ఎటూ పోదని ధీమాగా ఉన్నారట. మంత్రి వర్గంలో 90 శాతం మార్పు చేసినా తమ సీటుకు ఎలాంటి హాని జరగదని అనుకుంటున్నారట.. ఇంతకీ వారు అలా అనుకోవడానికి కారణమేంటి..? వారిపై జగన్ కు ఎలాంటి అభిప్రాయం ఉంది..?
Also Read: ఎట్టకేలకు ‘పంచాయతీ’కి సిద్ధమవుతున్న వైసీపీ?
నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనిల్ నీటి పారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల విమర్శలకు వెంటనే స్పందిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతున్న అనిల్ పై జగన్ కు మంచి అభిప్రాయం ఏర్పడిదంట.
కానీ ఆయన రెడ్డి వర్గాన్ని తీవ్రంగా డామినేట్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కొంత మంది ఫిర్యాదు చేశారు కూడా. మరోవైపు అనిల్ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధి మంత్రి పదవి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయినా కూడా పరుష వ్యాఖ్యలతో అనిల్ అసెంబ్లీలోనూ అదరగొట్టారు. దీంతో ఆయన మంత్రి పదవి ఎటూ పోదనే సంకేతాలు జగన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు కీలక నిర్ణయం
ఇక మరో మంత్రి కొడాలి నానిపై కూడా జగన్ కు ఇదే అభిప్రాయం ఉందట. నాని సైతం ప్రతిపక్షాల ఆరోపణలు చేయడమే తరువాయి ఆయన ‘ఒరేయ్..’ అనే వ్యాఖ్యలతో సంచలనం రేపాడు. కమ్మ సామాజిక వర్గంకు చెందిన ఆయన అభివ్రుద్ధి విషయం పక్కనబెడితే వైసీపీపై విమర్శలు వచ్చిన వెంటనే స్పందిస్తారు. దీంతో జగన్ నానికి మంత్రి పదవి తప్పిస్తే పార్టీకి లోటు ఏర్పడుతుందని భావిస్తున్నారట. అంటే కొడాలి నాని మంత్రి పదవి కూడా సేఫ్ అని అనుకుంటున్నారు.
మిగతా మంత్రుల్లోనూ కొందరు దూకుడుగా వ్యవహరించినా ఈ ఇద్దరి మంత్రుల విషయంలో జగన్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మొత్తం మార్చినా వీరిని మాత్రం జగన్ మార్చే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఇలాంటి దూకుడు స్వభావాన్ని కొందరు ఇప్పటికైనా పెంచుకొని తమ మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్