చలికాలంలో పెదవులు పగలటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మృదువుగా ఉండే పెదవులు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల పగలటం జరుగుతుంది. చాలామంది లిప్ బామ్ వేసుకొని సమస్యకు చెక్ పెడదామని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వివిధ ఆరోగ్య సమస్యలు కూడా పెదవులు పగలడానికి కారణమవుతూ ఉంటాయి. పెదాలు పగలటానికి సరైన కారణం తెలుసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినా, తరచూ నాలుకను పెదవులతో తడుపుతూ ఉన్నా, ఏదైనా ముఖానికి ఉపయోగించిన ప్రాడక్ట్ శరీరానికి పడకపోయినా, శరీరానికి అవసరమైన నీటిని ఎక్కువగా తీసుకోకపోయినా పెదాలు పగిలే అవకాశం ఉంటుంది. శరీరంలో నీళ్లు తక్కువైతే చర్మం పొడిగా మారి పెదవులు పగులుతాయి. పెదాలకు జెల్లీ లేదా కలబంద రసం రాస్తే పగుళ్లు రాకుండా చేయవచ్చు.
Also Read: తెల్ల జుట్టును నల్లగా మార్చటానికి పాటించాల్సిన చిట్కాలివే..?
మర్కెట్ లో దొరికే లిప్ బామ్ లలో స్కిన్ ప్రొటక్షన్ ఫ్యాక్టర్ ఉన్న లిప్ బామ్ నే ఎంచుకోవాలి. విటమిన్ బి ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా పెదవులు పగలకుండా జాగ్రత్త పడవచ్చు. మాయిశ్చరైజర్ ను ఎక్కువగా వినియోగించడం ద్వారా పెదవులు తడి ఆరిపోకుండా చేయవచ్చు. వెన్నను పెదాలకు వాడటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కెరలో కొద్దిగా నిమ్మరసం వేసి పెదాలకు రుద్దినా మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
లిప్ బామ్, జెల్ వాడటం ఇష్టం లేనివాళ్లు ఇంట్లోనే గిన్నెలో తేనె, కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని స్క్రబ్ బేస్ గా ఉపయోగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచూ వాడటం వల్ల పెదవులు ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తాయి.