Nalla Thumma Chettu : మనకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల చెట్లు వినియోగిస్తాం. వాటితో మనకు ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలిగేందుకు దోహదపడే సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సాయపడుతున్నాయి. మన ఊళ్లలో కనిపించే తుమ్మ చెట్టు కూడా మనకు ఎన్నో లాభాలు అందిస్తోంది. దీంతో మన శరీరానికి పనికొచ్చే పలు వ్యాధులకు మందు తయారవుతుందని ఎంత మందికి తెలుసు.
ఇది అకేసి జాతికి చెందిన చెట్టు. ఇది పాకిస్తాన్ లోని సింధూ నదీ ప్రాంతానికి చెందినది. మనదేశంలో విరివిగా కనిపిస్తుంది. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. నల్లతుమ్మ, తెల్ల తుమ్మ, ఆస్ట్రేలియా తుమ్మ, నాగ తుమ్మ, సర్కారు తుమ్మ అని వివిధ పేర్లున్నాయి. దీనికి ముళ్లు చాలా పెద్దగా ఉంటాయి. ఆకులు పచ్చగా ఉంటాయి. దీని అన్ని భాగాలు మందుగా ఉపయోగపడతాయి.
నల్ల తుమ్మ బెరడు, బెరడును మెత్తగా దంచుకుని పొడి చేసుకోవాలి. దీన్ని రోజుకు రెండు పూటలు తీసుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుంది. నల్ల తుమ్మ లేత ఆకులను మెత్తగా నూరుకుని ఆ రసాన్ని తాగడం వల్ల నెలసరిలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల తుమ్మ కాయలను తీసుకుని వాటిని నీడలో ఎండబెట్టుకుని తరువాత పొడిగా చేసుకుని అందులో కండ చక్కెర పొడి వేసుకుని తాగితే పురుషుల్లో లైంగిక సమస్యలు దూరమవుతాయి.
ఇన్ని రకాల ప్రయోజనాలున్న నల్ల తుమ్మతో పలు రకాల వ్యాధులకు ఔషధం తయారు చేసుకోవచ్చు. చేలకు కంచెలు ఏర్పాటు చేసేందుకు కూడా నల్ల తుమ్మ పొరకను ఉపయోగిస్తారు. ఇలా నల్ల తుమ్మ మనకు ఎన్నో లాభాలు కలిగిస్తోంది. దీనితో నోటిపూత వంటి అల్సర్ సమస్యల నుంచి కూడా లాభం పొందవచ్చు. నల్లతుమ్మ ఎక్కడ కనిపించినా వదలకుండా దాని భాగాలు తెచ్చుకుని మందు తయారు చేసుకుని వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.