
Get Rid of Pimples : మన చర్మంపై చిన్న కాయలుగా ఏర్పడే వాటిని పిలిపిర్లు అంటారు. ఇంకా వీటిని ఉలిపిరి కాయలు అని సంబోధిస్తారు. వాట్స్ అని కూడా పిలుస్తుంటారు. చర్మంపై కొంచెం కనిపిస్తే వాటిని పులిపిర్లనీ, వాట్స్ అని చెబుతుంటారు. వాట్స్ అంటే ఏమిటి? కొన్ని రకాల వైరస్ ల వల్ల వాట్స్ వస్తుంటాయి. పిలిపిర్లు పోగొట్టుకోవడానికి రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ అవి అలాగే ఉంటాయి.
ఎక్కడ ఏర్పడతాయి?
పులిపిర్లు ఎక్కువగా చేతి వేళ్ల మధ్య, కాలి వేళ్ల మధ్య ఏర్పడతాయి. ఇంకా మెడ చుట్టు వస్తాయి. ఇది ఓ రకమైన వైరస్ వల్ల వస్తాయని చెబుతుంటారు. కొవ్వు ఎక్కువగా పెరిగన సందర్భంలో పులిపిర్లు పుట్టుకొస్తాయి. పులిపిర్లు తొలగించుకోవడానికి రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. తమలపాకులు సున్నం కలిపి పులిపిర్లు ఉన్న చోట రాస్తే ఫలితం ఉంటుంది.

ఎలాంటి పరిహారం
తమలపాకులు నాలుగు తీసుకోండి. తొడిమతో పాటే వాటిని సున్నంతో కలిపి దంచుకుని పేస్టులా చేసుకోవాలి. దాన్ని పులిపిరి ఉన్న చోట రాసుకోవాలి. దాని చుట్టు వ్యాస్ లేన్ వంటిది ఉంచుకోవాలి. దీని వల్ల పులిపిరి పోయేందుకు మార్గం ఏర్పడుతుంది. ఈ చిట్కా ఓ వారం రోజులు చేయడం వల్ల పులిపిరి పోతుంది. రోజు సాయంత్రం రాసుకుని దాని మీద ఓ పట్టీ వేయండి తెల్లవారి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పులిపిరి లేకుండా పోతుంది.
పులిపిరి తొలగించుకునేందుకు..
ఇలా చేయడం వల్ల పులిపిరి సమస్య లేకుండా పోతుంది. తమలపాకుల వల్ల ఇంత మంచి ఫలితం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిట్కాను ఉపయోగించుకుని పులిపిరి సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇలా తమలపాకులతో ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. మనం తిన్ని ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు తమలపాకులు దోహదం చేస్తాయి. దీంతో మనకు పలు రకాల లాభాలు కలుగుతాయని నమ్మకం.