weight loss : వామ్మో యాపిల్ ను ఇన్ని రకాలుగా తినవచ్చా? ప్రయోజనాలు కూడా మెండేనండోయ్..

బరువు తగ్గడం ముఖ్యమే. కానీ, హెల్దీగా బరువు తగ్గడం మరింత ముఖ్యం. అందుకోసం హెల్దీ ఆప్షన్ ఆపిల్స్ అంటున్నారు నిపుణులు. ఇవి కాస్తా ధర ఎక్కువైనప్పటికీ మనకి అందించే పోషకాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు నిపుణులు. ఈ పండ్లు మనకి ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. ఇందులో ఎక్కువగా హైలెవల్ పోషకాలు ఉంటాయి. దీంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే, ఇది ఆపిల్ సైజ్‌ని బట్టి కూడా ఉంటాయి. ఇందులో రిచ్ ఫైబర్ ఉంటుంది. మనకి కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. బరువు తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. అందుకోసం ఆపిల్స్‌ని ఎలా తీసుకోవాలంటే..

Written By: Swathi Chilukuri, Updated On : October 14, 2024 1:28 pm

Weight loss is important. But, healthy weight loss is more important

Follow us on

Weight loss : ఆపిల్‌ని బెస్ట్ స్నాక్ ఐటెమ్‌గా కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం, ఆపిల్స్‌పై పీనట్ బటర్ అప్లై చేసి తినొచ్చు. దీని వల్ల క్రంచీ అండ్ టేస్టీని ఎంజాయ్ చేయవచ్చు. పీనట్ బటర్‌లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా, ఓట్స్‌తో కలిపి ఆపిల్స్‌ని తీనవచ్చు అని మీకు తెలుసా? ఇలా తిన్నా సరే మంచి ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

ఆపిల్స్‌ని మార్నింగ్ మీల్ అంటే బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. మార్నింగ్ ఆపిల్స్ తినడం వల్ల మరే జంక్ ఫుడ్ తినాలనిపించదు. క్రేవింగ్స్ కంట్రోల్‌లో ఉంటాయి. దీనికోసం ఆపిల్స్‌ని స్మూతీస్‌, పుడ్డింగ్‌లో యాడ్ చేసుకుని సేవించండి మంచి ఫలితాలు ఉంటాయి.

మనసుంటే మార్గాలు బోలెడు ఉంటాయి. అందులో భాగంగానే ఆపిల్స్‌ని లంచ్‌లోనూ హ్యాపీగా తీసుకోవచ్చు. వీటితో మీరు కొత్త కొత్త వంటకాలని ట్రై చేయొచ్చు. దీని వల్ల మీ టేస్ట్ బడ్స్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కూడా. ఈ ఆపిల్స్‌ని ఆనియన్స్‌తో కలిపి చట్నీ చేయొచ్చు. లేదా చికెన్ వండినప్పుడు ఆపిల్ వ్రాప్స్‌ చేయొచ్చు. శాండ్విచ్‌లో కూడా యాడ్ చేయొచ్చు. ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఆపిల్స్‌ని ఎంజాయ్ చేయడం మిస్ అవద్దు.

ఆపిల్స్‌ని డిసర్ట్స్‌లా కూడా చేయొచ్చు. ఇందులోని కొద్దిపాటి తియ్యదనం, జ్యూసీ ఫ్లేవర్ డిషెష్‌కి చాలా మంచి ఫ్లేవర్స్‌ని ఇస్తాయి. మీరు ఏదైనా బేకింగ్ చేస్తున్నప్పుడు అందులో పంచదార బదులు మనం ఆపిల్ సాస్‌ని వాడొచ్చు. దీని వల్ల కాస్తా కేలరీలు కూడా తగ్గిస్తాయి. ఆపిల్ టార్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇది హెల్దీ డిసర్ట్ అని కూడా చెప్పొచ్చు.

లంచ్ తర్వాత డిన్నర్ చేసే గ్యాప్‌లో కొన్ని క్రేవింగ్స్ వస్తుంటాయి  కదా సో ఏవైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఆ టైమ్‌లో ఇష్టంలేని జంక్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటివి తినాలి అనిపిస్తుంటుంది. ఆ టైమ్‌లో మీరు ఆపిల్స్‌ని ఎలా అయినా తింటే ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీ మీల్ ఆప్షన్‌గా ఉంటుంది. దీని వల్ల క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. బరువు కూడా తగ్గుతారు.

అయితే, ఇక్కడ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చాం. ఎలా తీసుకున్నా మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీ అవసరాన్ని బట్టి ఏ టైమ్‌లో తినాలో గుర్తుంచుకోండి. అంతేకానీ ప్రతి సమయంలో యాపిల్ తినాలి అనే కాన్సెప్ట్ కాదు.