Actor Bala Arrested: ప్రముఖ మలయాళ నటుడు బాల అలియాస్ బాలకుమార్ ఎర్నాకులంలో కడవంత్రా పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిల్చింది. ఆయన మాజీ భార్య, ప్రముఖ గాయని అమృత సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవుట్ రేజింగ్ మోడెస్టీ ఆఫ్ విమెన్ మరియు జువెనైల్ చట్టం క్రింద అరెస్ట్ చేసారు. బాల వద్ద మూడేళ్ళ పాటు డ్రైవర్ గా పని చేసిన వ్యక్తి సోషల్ మీడియా లో ఒక పోస్టు పెడుతూ ‘ వాళ్లిద్దరూ ఇప్పుడు విడిపోయారు కాబట్టి, వాళ్లకు సంబంధించిన ఏ విషయం కూడా నేను దాచాలని అనుకోవడం లేదు. బాల అనేక సార్లు అమృత పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన కూతురు అవంతిక చూస్తుందనే ద్యాస కూడా అతనికి లేదు. ఒకరోజు అవంతిక మరియు ఇంట్లో బంధువుల సమక్షంలో అమృత పై దాడి చేయడం కూడా నేను చూసాను. అందుకు నా వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అతను కొట్టిన దెబ్బల కారణంగా అమృత శరీరం పై మచ్చలు కూడా పడ్డాయి. పాపం ఆమె దాని కోసం చికిత్స కూడా చేయించుకుంది’ అంటూ ఒక ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాడు.
ఇది ఇలా ఉండగా బాల కొద్దిరోజుల క్రితమే అమృత గురించి మాట్లాడుతూ అమృత తన కూతురుని కలవనివ్వడం లేదని, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ ప్రతీసారీ అడ్డు పడుతుందని ఒక వీడియో ద్వారా తెలిపాడు. ఒకవేల నా కూతురు అవంతిక కి నన్ను కలవడం ఇష్టం లేకపోతే నేను ఆమెను ఇబ్బంది పెట్టను, కానీ నా కూతురికి ఇష్టం ఉన్నప్పటికీ కూడా మమల్ని కలవనివ్వకుండా చేస్తుంది అంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఆ తర్వాత అమృత బాల తనతో, తన తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ని పోస్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ బాల సోషల్ మీడియా పోస్టుల ద్వారా తనపై అసత్య ప్రచారాలు చేసి వేలాది మంది అభిమానుల ముందు నా పరువు మర్యాదలకు భంగం కలిగించాడని, అంతే కాకుండా తన వీడియోలతో తమ కూతురుని మానసికంగా ఎమోషనల్ బ్లాక్ మెయిన్ చేసాడని ఫిర్యాదులో పేర్కొనింది. అందుకు తగ్గ ఆధారాలతో సహా పోలీసులకు అందించడంతో, పోలీసులు విచారణ జరిపి కాసేపటి క్రితమే కొచ్చిలోని బాలా ఫ్లాట్ లో అరెస్ట్ చేసారు.
బాలా మాయలయ చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడు. అతని తాత గారు అరుణాచల స్టూడియోస్ యజమాని. అతని తండ్రి మలయాళం లో పాపులర్ దర్శకుడు. సుమారుగా 350 సినిమాలకు పైగా ఆయన దర్శకత్వం వహించాడు. ఇక బాలా సోదరుడు శివ కూడా ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే బాల మన తెలుగు సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. 2002 వ సంవత్సరం లో విడుదలైన ‘టూ మచ్’ అనే చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తమిళం లో అన్బు అనే చిత్రం తో మరింత పాపులర్ అయ్యాడు. అలా సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ నెట్టుకొస్తున్న బాలకుమార్ కి మలయాళం లో అవకాశాలు వచ్చాయి. 2006 వ సంవత్సరం లో ఆయన కలాభమ్ అనే చిత్రం తో అరంగేట్రం చేసాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయనకీ మంచి గుర్తింపు రావడంతో ఆ ఇండస్ట్రీ లోనే స్థిరపడ్డాడు. రీసెంట్ గా ఆయన నుండి ‘బ్యాడ్ బాయ్స్’ అనే చిత్రం విడుదల అయ్యింది.