https://oktelugu.com/

రాత్రి సమయంలో ఈ స్నాక్స్ తింటున్నారా.. బరువు పెరిగే ఛాన్స్..?

మనలో చాలామంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే బరువు తగ్గాలని భావిస్తారు. అయితే చాలా సందర్భాల్లో మన ఆహారపు అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా లేట్ నైట్ స్నాక్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. Also Read: నిద్రపోతూ 10 లక్షల రూపాయలు గెలిచే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 26, 2021 / 12:31 PM IST
    Follow us on

    మనలో చాలామంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే బరువు తగ్గాలని భావిస్తారు. అయితే చాలా సందర్భాల్లో మన ఆహారపు అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా లేట్ నైట్ స్నాక్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి.

    Also Read: నిద్రపోతూ 10 లక్షల రూపాయలు గెలిచే ఛాన్స్.. ఎలా అంటే..?

    రాత్రి సమయంలో పిజ్జాను అస్సలు తినకూడదు. పిజ్జా ఎక్కువ కేలరీలను కలిగి ఉండటంతో పాటు అందులో ఉండే గ్రీజ్ గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఎక్కువ కేలరీలను కలిగి ఉండే కార్న్ ఫేక్స్ లేదా తీపి పదార్థాలు తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కార్న్ ఫేక్స్ లేదా తీపి పదార్థాలు రాత్రి సమయంలో ఆకలిని తగ్గించలేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువ కేలరీలను కలిగి ఉండి ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

    Also Read: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    రాత్రి సమయంలో కుకీలు, చాక్లెట్లను అస్సలు తినకూడదు. ఎక్కువగా తీపిని కలిగి ఉండే కుకీలు, చాక్లెట్లు నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్రలేమి సమస్యకు కారణమవుతాయి. ఎక్కువగా కొవ్వు శాతం, చక్కెర శాతం కలిగి ఉండే ఐస్ క్రీం కూడా నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. రాత్రి సమయంలో చిప్స్ అస్సలు తీసుకోకూడదు. చిప్స్ లో వ్యర్థమైన కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    రాత్రిపూట ఆహారం తీసుకోవాలనుకునే వారు పాప్ కార్న్ ను తీసుకుంటే మంచిది. ధాన్యం, ఫైబర్ పుష్కలంగా ఉండే పాప్ కార్న్ ఆహారం తక్కువ తినేలా చేస్తుంది. ఫైబర్ ను ఎక్కువగా కలిగి ఉన్న ఓట్ మీల్ సైతం తక్కువ తినడానికి కారణమవుతుంది. రాత్రి సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కెఫిన్ లేని టీని ఎంచుకుంటే మరీ మంచిది