దేశంలోని ప్రధాన నగరాలలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందనే సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వాయు కాలుష్యం చాలామందిలో దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతోంది. కడుపులో పెరిగే బిడ్డకు సైతం కాలుష్యం వల్ల ప్రమాదమేనని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గర్భిణీలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలని కలుషిత వాతావరణంలో గాలి పీల్చుకుంటే కాలుష్య కణాలు శరీరంలోకి వెళ్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.
పుట్టబోయే బిడ్డ ఊపిరితిత్తులపై ఈ కలుషిత రేణువుల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఆలస్యంగా బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం లాంటి సమస్యలు కలుషిత గాలి పీల్చిన మహిళలకు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గర్భిణీలు కాలుష్యానికి దూరంగా ఉండకపోతే ఆస్తమాతో కూడా బాధ పడే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ప్రధాన నగరాల్లో నివశిస్తున్న వాళ్లు ఇంటికే పరిమితమైతే మంచిదని చెప్పవచ్చు.
ప్రధాన నగరాలలో అలర్జీ, ఆస్తమా సమస్యలతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ సమస్యతో బాధ పడేవాళ్ల సంఖ్య 20 శాతం పెరిగిందని వైద్య నిపుణులు వెల్లడించారు. కాలుష్యం వల్ల ఆస్తమా రోగులకు ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశంతో పాటు బ్రోన్కైటిస్ వ్యాధి బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఎయిర్ ప్యూరిఫైయర్ వాడటం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు. వాకింగ్ చేసే సమయంలో మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. వేడి చేసిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.