Kuppam: కుప్పంలో ఘర్షణ.. రణరంగం.. మాజీ మంత్రి అరెస్ట్

Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇప్పుడక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ మొదలైంది. ఇది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిని లోపలేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్స్ సందర్భంగా వివాదం చెలరేగింది. మొత్తం 19మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇద్దరిని మాత్రమే అదుపులోకి […]

Written By: NARESH, Updated On : November 10, 2021 7:38 am
Follow us on

Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇప్పుడక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ మొదలైంది. ఇది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిని లోపలేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

tdp-leaders-attack-on-municipal-office-in-kuppam

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్స్ సందర్భంగా వివాదం చెలరేగింది. మొత్తం 19మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో బస చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఇతర జిల్లాల వారి కారణంగా కుప్పంలో గొడవలు జరుగుతున్నాయని అందుకే అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

అరెస్ట్ లకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం కార్యకర్తలు గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.