https://oktelugu.com/

నిద్రపోతూ 10 లక్షల రూపాయలు గెలిచే ఛాన్స్.. ఎలా అంటే..?

మనలో చాలామంది రోజూ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు. సరైన నిద్ర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. అయితే నిద్రపోవడం ద్వారా సులభంగా డబ్బులు కూడా సంపాదించవచ్చు. వేక్ ఫిట్ అనే కంపెనీ 100 రోజుల పాటు 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు అందజేస్తుంది. వేక్‌ ఫిట్‌ వారి బ్యాచ్‌ 2021 – 22 స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ లో పాల్గొనడం ద్వారా ఈ మొత్తం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 25, 2021 / 04:30 PM IST
    Follow us on

    మనలో చాలామంది రోజూ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు. సరైన నిద్ర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. అయితే నిద్రపోవడం ద్వారా సులభంగా డబ్బులు కూడా సంపాదించవచ్చు. వేక్ ఫిట్ అనే కంపెనీ 100 రోజుల పాటు 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు అందజేస్తుంది. వేక్‌ ఫిట్‌ వారి బ్యాచ్‌ 2021 – 22 స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ లో పాల్గొనడం ద్వారా ఈ మొత్తం పొందవచ్చు.

    Also Read: చాక్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?

    హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించాలని అనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. రోజూ గంటల తరబడి హాయిగా నిద్రపోయే వారికి స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ లో పాల్గొనడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. https://wakefit.co/sleepintern/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఇంటర్న్ షిప్ కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ ఇంటర్న్ షిప్ లో పాల్గొనాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉన్నాయి.

    Also Read: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    టర్మ్స్ అండ్ కండీషన్స్ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ పది లక్షల రూపాయలు పొందలేరు. ఎవరైతే విన్నర్ అవుతారో వారికి మాత్రమే పది లక్షల రూపాయలు సొంతమవుతాయి. మిగిలిన వారికి కేవలం లక్ష రూపాయలు మాత్రమే సొంతమవుతాయి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    100 రోజుల పాటు ప్రతి రోజూ 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్రపోయే వారు మాత్రమే ఇంటర్న్ షిప్ లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యుత్తమంగా నిద్రపోయే కొంతమందిని ఎంపిక చేసి ఇంటర్న్‌షిప్ ‌కు అర్హుల్ని చేస్తారు.