ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఎవరెవరంటే?

సీఎం జగన్ పార్టీని నమ్ముకొని ఉన్నవారికే పెద్దపీట వేశారు. పార్టీలో ఉంటూ చనిపోయిన నేతల కుమారులకు పదవులు ఇచ్చారు. బయట నుంచి ఎవ్వరికి ఇవ్వకుండా కేవలం తాను హామీనిచ్చినా.. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు కట్టబెట్టి మంచి సందేశాన్ని పార్టీ శ్రేణులకు పంపించారు. ఏపీలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ పార్టీని నమ్ముకొని ఉన్న వారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఆరుగురు వైసీపీ […]

Written By: NARESH, Updated On : February 25, 2021 4:57 pm
Follow us on

సీఎం జగన్ పార్టీని నమ్ముకొని ఉన్నవారికే పెద్దపీట వేశారు. పార్టీలో ఉంటూ చనిపోయిన నేతల కుమారులకు పదవులు ఇచ్చారు. బయట నుంచి ఎవ్వరికి ఇవ్వకుండా కేవలం తాను హామీనిచ్చినా.. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు కట్టబెట్టి మంచి సందేశాన్ని పార్టీ శ్రేణులకు పంపించారు.

ఏపీలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ పార్టీని నమ్ముకొని ఉన్న వారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు.

ఆరుగురు వైసీపీ అభ్యర్థుల పేర్లను వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రకటించారు.

ఇటీవల మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, చల్లా రామకృష్ణారెడ్డి కుమారులకు జగన్ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం విశేషం. దీన్ని బట్టి తిరుపతి ఎంపీ సీటును బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఇవ్వలేదన్న విషయం తేటతెల్లమైంది. దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ చక్రవర్తి, రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.

ఇక వీరితోపాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్ చార్జి దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, హిందూపురం వైసీపీ నేత మహ్మద్ ఇక్బాల్, విజయవాడకు చెందిన కరీమున్నీసాలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం ఎంపిక చేశారు.