చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మనలో చాలామంది చాక్లెట్స్ ను చాలా ఇష్టపడతారు. అయితే చాక్లెట్స్ తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చాలామంది భావిస్తారు. అయితే చాక్లెట్స్ తినడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చాక్లెట్స్ ను ఎక్కువగా తినకుండా మితంగా తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది.
Also Read: నిద్రపోతూ 10 లక్షల రూపాయలు గెలిచే ఛాన్స్.. ఎలా అంటే..?
చాక్లెట్స్ లో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. చాక్లెట్ ను తయారు చేసేందుకు ఉపయోగించే కోకాలో ఉండే ఫెలీఫానెల్స్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. మిల్క్ చాక్లెట్స్ తిన్నా డార్క్ చాక్లెట్స్ తిన్నా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. చాక్లెట్స్ మానసిక స్థితిలో మార్పు రావడానికి కారణమవుతాయి. ఆనందమైడ్ అనే కొవ్వు ఆమ్లాన్ని చాక్లెట్లు కలిగి ఉంటాయి.
Also Read: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
ఈ కొవ్వు ఆమ్లం ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంతో పాటు మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుంది. చాక్లెట్ లో ఉండే ఫినైల్ ఇథైలామైన్ మనుషుల్లో ప్రేమను పెంపొందించడానికి దోహదపడటంతో పాటు కెఫిన్ మెదడును చురుకుగా పని చేసేలా చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం చాక్లెట్లు గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగని పక్షంలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాక్లెట్ లో ఉండే ఫ్లేవనోల్ రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేయడంలో సహాయపడుతుంది. చాక్లెట్లు వృద్ధుల్లో వచ్చే అల్జీమర్స్ ను తగ్గించడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.