రేషన్ బియ్యం తినే వారికి షాకింగ్ న్యూస్..?

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను చూసి సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రేషన్ బియ్యమే కడుపు నిండా తిండి తినడానికి కారణమవుతోంది. లక్షల సంఖ్యలో కుటుంబాలకు రేషన్ బియ్యం వల్లే అంతోఇంతో ఖర్చు తగ్గుతోంది. అయితే చివరకు తినే రేషన్ బియ్యం సైతం కల్తీ అవుతూ ఉండటంతో షాక్ అవ్వడం ప్రజల వంతవుతోంది. గతంలో ప్రజలు బియ్యంలో రాళ్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : October 9, 2020 8:29 pm
Follow us on

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను చూసి సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రేషన్ బియ్యమే కడుపు నిండా తిండి తినడానికి కారణమవుతోంది. లక్షల సంఖ్యలో కుటుంబాలకు రేషన్ బియ్యం వల్లే అంతోఇంతో ఖర్చు తగ్గుతోంది.

అయితే చివరకు తినే రేషన్ బియ్యం సైతం కల్తీ అవుతూ ఉండటంతో షాక్ అవ్వడం ప్రజల వంతవుతోంది. గతంలో ప్రజలు బియ్యంలో రాళ్లు కలవడం, బియ్యం క్వాలిటీగా లేకపోవడం లాంటి ఇబ్బందులు చూసే ఉంటాం. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం బియ్యంలో యూరియా కలిసింది. బియ్యం వేయించుకున్న ప్రజలు తినలేదు కాబట్టి సరిపోయింది కానీ తింటే పెద్ద ప్రమాదమే జరిగేది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మర్కగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో గిరిజన ప్రజలు నివశిస్తూ ఉంటారు. బియ్యంలో యూరియా రావడంతో గ్రామస్తులు రేషన్ డీలర్ ను ప్రశ్నించగా అతను తనకేం తెలీదని చెప్పాడు. దీంతో గ్రామస్థులు డీలర్ గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, ఇతర అధికారులు పరిశీలించి నిజంగానే బియ్యంలో యూరియా కలిసిందని నిర్ధారించారు.

ఇలా కల్తీ ఘటనల్లో చాలావరకు అసలు దోషులు దొరకడం లేదు. దీంతో అధికారులకు సైతం కల్తీని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేస్తే మాత్రమే కల్తీని నిరోధించడం.