https://oktelugu.com/

అనుష్కకు నో చెప్పిన జక్కన్న.. అలియాకు ఓకే అంటాడా?

‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా అలియాభట్ తొలిసారి టాలీవుడ్ కు పరిచయం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 08:54 PM IST
    Follow us on

    ‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

    ఈ సినిమాలో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా అలియాభట్ తొలిసారి టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా అలియా సీత పాత్రలో కనువిందు చేయనుంది. ఈ సినిమా షూటింగు ఇటీవల పునఃప్రారంభమైంది. ఇందులో రాంచరణ్.. ఎన్టీఆర్ తోపాటు అలియా కూడా పాల్గొందనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: కొత్త వంటకాలతో అదరగొడుతున్న సమంత..!

    ఈ సినిమా కోసం అలియా భట్ తెలుగు నేర్చుకుంటుందట. సీత పాత్రలో హవాభావాలను మరింత పలికించేందుకు అలియా తెలుగు నేర్చుకుంటుందనే టాక్ విన్పిస్తోంది. ఇందులో తన పాత్రకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తుందట. అందుకే ఆమె తెలుగు నేర్చుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి దర్శకుడు రాజమౌళి ఏమేరకు ఒప్పుకుంటాడనే ప్రశ్నార్థకంగా మారింది.

    గతంలో అనుష్కశెట్టి ‘బాహుబలి’ సినిమాలో డబ్బింగ్ చెప్పాలని ఉందని రాజమౌళికి చెప్పిందట. అయితే సినిమా ఫర్ఫెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే రాజమౌళి డబ్బింగ్ విషయంలో అనుష్కకు నో చెప్పాడటని టాక్. అలాంటిది రాజమౌళి ఇప్పుడు అలియా డబ్బింగ్ చెబుతానంటే ఒప్పుకుంటాడా? అనే సందేహాలు కలుగుతున్నారు. తెలుగు బాగా మాట్లాడే అనుష్కకే రాజమౌళి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక తెలుగు సరిగారాని అలియా విషయంలో రాజమౌళి మొహమాటం లేకుండా నో చెబుతాడనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: సినీ ప్రియులు పండుగ చేసుకోండి..!

    ఇటీవలే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభించి ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. అదేవిధంగా ఈనెల 22న దసరా పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే రిలీజైన రాంచరణ్ టీజర్ అభిమానుల్లో గుస్ బంప్స్ రాగా.. ఎన్టీఆర్ టీజర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ నెలకొంది.