Viagra: అవసరం లేకున్నా వయాగ్రా వాడుతున్నారా?

Viagra: పడక గదిలో ఎక్కువ సంతోషాన్ని పొందాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల మనసు ప్రశాంతంగా లేక అనుకున్న తృప్తిని పొందలేరు.

Written By: Srinivas, Updated On : June 25, 2024 10:18 am

Viagra Side Effects on the Body

Follow us on

Viagra: సాధారణంగా పిల్లలు కాకపోవడానికి ఆడవారిలో ఉండే సమస్యలే కారణమని కొందరికి తెలుసు. కానీ పురుషుల్లో లోపం కారణంగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ప్రస్తుత కాలంలో కొన్ని పనుల కారణంగా పురుషులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రశాంతమైన జీవితం గడపలేకపోతున్నారు. ఫలితంగా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఒత్తిడి కారణంగా పడక గదిలోకి వెళ్లగానే పురుషుల్లో అంగస్తంభన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన కొందరు పురుషులు వయగ్రా మాత్రలు వాడుతూ ఉంటారు. కానీ కొందరు ఎక్కువ సంతోషాన్ని పొందడానికి కూడా వీటిని వాడుతున్నారు. కానీ ఇలా వేసుకోవడం వల్ల ఎన్ని అనర్థాలో తెలుసా?

పడక గదిలో ఎక్కువ సంతోషాన్ని పొందాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల మనసు ప్రశాంతంగా లేక అనుకున్న తృప్తిని పొందలేరు. దీంతో సంతోషంగా ఉండడానికి పీడీఈ 5 మాత్రలను వాడుతూ ఉంబటారు. ఇది వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి కోరికలు పుడుతాయి. పురుషుని ప్రధాన భాగం గట్టిపడేలా చేసి సంభోగం సక్రమమంగా జరిగేలా సహకరిస్తుంది. అయితే దీనిని అంగస్తంభన సమస్య ఉన్నవారు వాడితే ఉపయోగం. కానీ కొందరు సరదా కోసం కూడా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే?

Also Read: Health Tips: 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయండి..

పదే పదే సిల్డినాఫిల్ సిట్రేట్ (వయాగ్రా) మాత్రలు వాడడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువేనని కొందరు వైద్యులు తేల్చారు. ఇవి వాడడం వల్ల రక్తపోటను తగ్గిస్తాయి. అయితే అప్పటికే బీపీ టాబ్లెట్లు వాడేవారు అయితే వీరికి ఇవి ప్రమాదకరంగా మారుతాయి. ఈ రెండు మాత్రల రసాయన చర్య వల్ల శరీరానికి హాని చేస్తాయి. సిల్డినాఫిల్ సిట్రేట్ వేసుకోవడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. కానీ కొందరి ఛాతి నొప్పి ప్రారంభమవుతుంది. కండరాల నొప్పులు, ముక్కు బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొందరిక అదేపనిగా అంగం గట్టిగా ఉండే ప్రమాదం ఉంది.

Also Read: Monsoon season: వామ్మో వర్షాకాలం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

ఏదైనా ఒక పని కోసం అలవాటును ఏర్పరుచుకుంటే మానసికంగా దానికి అడిక్ట్ అయిపోతారు. అలాగే వయాగ్రాకు అలవాటు పడిపోవడం వల్ల ఆ మాత్రలు లేనిది సంభోగంల పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపరు. దీంతో జీవితభాగస్వామితో విభేదాలు రావొచ్చు. మార్కెట్లో రకరకాల వయాగ్ర టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కొన్నింటిలో సరైన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. మరికొన్నింటిలో తక్కువగా ఉంటుంది. ఇలా హెచ్చు, తగ్గులు ఉండడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇంకొందు మద్యం తాగి ఈ మాత్రలు వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి ప్రమాదకంగా మారొచ్చు.