Monsoon season: వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో నీరు నిలిచి దోమలు మొదలవుతాయి. దోమలు వచ్చాయంటే వద్దన్నా వ్యాధులు వస్తాయి. వర్షాకాలంలో కచ్చితంగా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలంలో ఎండ వేడికి ఏసీ, ఫ్యాన్ లతో సర్దుకుపోవచ్చు. కానీ ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో సర్దుకుపోవడం అంటే చాలా కష్టం కదా. అందుకే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాల్సిందే. మరి మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి: ఈ సమయంలో చేతులను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది కాబట్టి జాగ్రత్త. వర్షాకాలం తడి తడిగా అనిపిస్తుంది కాబట్టి నీరుకు దూరంగా ఉండాలి అనిపించి చేతులు శుభ్రం చేసుకోకుండా ఉండకూడదు. డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే చేతులను శుభ్రం చేసుకోవాలి. పిల్లలను ముట్టుకొనేటప్పుడు, తినేముందు, మొహాన్ని తాకేముందు చేతులను కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి.
వ్యాయామం: వర్షాకాలంలో వర్షం కురుస్తుంటే వ్యాయామం ఎలా చేయాలి అనుకుంటున్నారా? వర్షం వస్తే వాకింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే వ్యాయామం చేస్తుండాలి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. యోగా, వ్యాయామం, డాన్స్, నవ్వడం, చిల్ అవ్వడం వంటివి చేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
పోషకాహారం: ఈ సమయంలో పోషకాహారం తినడం వల్ల చాలా వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే మీ పోషకాహారం వ్యాధులతో పోరాడి మిమ్మల్ని అనారోగ్య పాలు కాకుండా చూసుకుంటుంది. ఈ ఆహారం వల్ల మీరు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు.
విటమిన్స్: విటమిన్లు ఉండే ఆహారాన్ని కూడా కచ్చితంగా తీసుకోవాలి. ప్రతి విటమిన్స్ శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా అవసరం. వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్న ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరం బయట ఎంత క్లీన్ గా ఉన్నా.. లోపల నుంచి పోరాటం చేయాలంటే విటమిన్స్ అవసరం.