https://oktelugu.com/

Heroine: తండ్రితో కలిసున్న ఈమె.. ఇప్పుడు హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి..

Heroine: సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటా ఆవ గింజంత అదృష్టం ఉండాలి. అయితే అందం, అభినయం ఉన్న ఈ భామ మొదట్లో హీరోయిన్ గా అలరించినా..

Written By: , Updated On : June 25, 2024 / 10:25 AM IST
Eesha Rebba Childhood Pic Goes Viral on Social Media

Eesha Rebba Childhood Pic Goes Viral on Social Media

Follow us on

Heroine: సినీ సెలబ్రెటీలకు సంబంధించి చిన్న నాటి పిక్స్ సోషల్ మీడియాలో ఈమధ్య తెగ వైరల్ అవుతున్నాయి. హీరో,హీరోయిన్లు తమ ఫ్యాన్స్ ను అలరించేందుకు తమ చిన్న నాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. లేటేస్టుగా ఫాదర్స్ డే సందర్భంగా ఓ నటి తన నాన్నతో ఉన్న ఓ పిక్ ను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ఉన్నారు. ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆ తరువాత సైడ్ పాత్రల్లో కనిపిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే కిందికి వెళ్లండి..

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటా ఆవ గింజంత అదృష్టం ఉండాలి. అయితే అందం, అభినయం ఉన్న ఈ భామ మొదట్లో హీరోయిన్ గా అలరించినా.. ఆ తరువాత అవకాశాల్లేక సైడ్ పాత్రల్లో కనిపిస్తోంది. అయితే సినిమాల్లో తక్కువగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. ఇలా యూత్ లో తెగ క్రేజీ సంపాదించుకున్న ఆ బ్యూటీ ఎవరో కాదు.. ఈ షా రెబ్బా.. ఈషా రెబ్బా గురించి సినీ ప్రేక్షకులకు తెలియంది కాదు..

Also Read: Shalini Pandey: బికినిలో స్కిన్ షోకి తెరలేపిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. షాలిని పాండేను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఈషా రెబ్బా చదువు పూర్తయిన తరువాత సినిమాల్లోకి రావాలని అనుకుంది. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల మూవీ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో మెయిన్ హీరోయిగా ఈషా రెబ్బా అలరించింది. ఈ మూవీ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో ఈమె తొందర్లోనే ఫేమస్ అయింది. వెనువెంటనే ఆమెకు మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత ‘అమీ తుమీ’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి.

Also Read: Kalki Movie: కల్కి మూవీ: కంటెంట్ లో స్ట్రాంగ్ .. ప్రమోషన్స్ లో వీక్..?

ఆ తరువాత బ్రాండ్ బాబు, అరవింత సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా మలకాళం నుంచి ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈషా ‘ఒట్టు’ అనే సినిమాలో నటించింది. చివరికిగా ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో కనిపించింది. ఆయితే ప్రస్తుతం ఈమె ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు సినిమాట్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది ఈషా. లేటేస్టుగా ఈషా నాన్నతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో అలరిస్తోంది.