Health Tips: వయసు పెరుగుతున్న కొద్ది చాలా సమస్యలు వస్తుంటాయి. వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఎన్నో వ్యాధులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటితే వ్యాధులు రావడం కామన్. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వయసుతో పాటు కేర్ కూడా ముఖ్యమే. అవేంటో కూడా ఓ సారి చూసేయండి.
వాకింగ్: అందరూ తీసుకోవాల్సిన సింపుల్ కేర్ వాకింగ్. దీని వల్ల మీరు చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. వాకింగ్ ను ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా చేసుకోవచ్చు కూడా. దీని వల్ల గుండె సమస్యలు, బీపీ వంటి వాటిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అంతేకాదు బరువు పెరగకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అయితే ప్రతి రోజు ఒక 30 ని. లు వాకింగ్ చేస్తే.. మీకు వచ్చే గుండె సమస్యలను తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
కండరాలు, ఎముకల బలం.. కండరాల పుష్టి ఎముకల బలం కోసం నిత్యం ప్రయత్నిస్తుండాలి. వీటికి సంబంధించిన వ్యాయామాలు కూడా ఉంటాయి. వర్కౌట్స్ చేస్తూ మీ ఎముకల, కండరాల బలాన్ని పెంచుకోవాలి. యోగా వల్ల కూడా మీ కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తుండాలి. వృక్షాసన, బద్దకోనాసణలు మీకు మజిల్ స్ట్రెంత్ ను పెంచడంలో తోడ్పడుతాయి.
సైక్లింగ్.. సైక్లింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఎక్కువ పొందవచ్చు. యువతరం నుంచి వృద్దాప్యం వరకు కూడా సైక్లింగ్ చేయవచ్చు. కానీ వయసును బట్టి కాస్త మీ స్పీడ్ ను పెంచడం, తగ్గించడం వంటివి చేయాలి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైకులు, కార్లు ఉండటం వల్ల కనీసం పిల్లలు కూడా సైక్లింగ్ చేయడం లేదు. సైక్లింగ్ చేస్తే మీరు ఊహించని ప్రయోజనాలు పొందవచ్చు.