Kalki Movie: కల్కి మూవీ: కంటెంట్ లో స్ట్రాంగ్ .. ప్రమోషన్స్ లో వీక్..?

Kalki Movie: రాజమౌళి లాంటి డైరెక్టర్ త్రిబుల్ ఆర్, బాహుబలి లాంటి సినిమాలను ప్రమోట్ చేయడంలో చాలావరకు కీలకపాత్ర వహించాడు. సినిమా రిలీజ్ కి ఒక రెండు నెలల ముందు నుంచే ఆయన విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ...

Written By: Gopi, Updated On : June 25, 2024 10:10 am

Kalki Movie Strong in Content

Follow us on

Kalki Movie: ప్రస్తుతం కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన బజ్ అయితే ప్రేక్షకుల్లో చాలా బాగా క్రియేట్ అయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ ను ఎక్కువగా చేయనప్పటికీ ఇక్కడ ఆల్రెడీ ప్రభాస్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి మంచి హైప్ అయితే వస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయంలో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి.

రాజమౌళి లాంటి డైరెక్టర్ త్రిబుల్ ఆర్, బాహుబలి లాంటి సినిమాలను ప్రమోట్ చేయడంలో చాలావరకు కీలకపాత్ర వహించాడు. సినిమా రిలీజ్ కి ఒక రెండు నెలల ముందు నుంచే ఆయన విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద హైప్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక కల్కి సినిమా విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్, అలాగే ముంబైలో రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మినహాయిస్తే వీళ్ళు ఎక్కడా కూడా పెద్దగా ప్రమోషన్స్ అయితే చేసినట్లు కనిపించడం లేదు.

Also Read: Kamal Haasan: 15 రోజుల గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ గెటప్ లు.. కమల్ కు ఇది ఎఫెక్ట్ యేనా?

నిజానికి తెలుగులో అయితే వీళ్ళు ప్రమోషన్ చేయకపోయిన నడుస్తుంది. కానీ మిగతా రాష్ట్రాల పరిస్థితి అలా కాదు సినిమా మీద ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెంచితే సినిమాకి అంత హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓపెనింగ్స్ రూపంలోనే సినిమా టాక్ బయటకు తెలిసేలోపే భారీ కలెక్షన్స్ వస్తాయి. అందుకోసమే ప్రమోషన్స్ ను సినిమా యూనిట్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇక ప్రభాస్ అయితే ఒకటి రెండు చీట్ చాట్ లకు మాత్రమే పరిమితమయ్యాడు. అంతకుమించి ఆయన ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. ఇక ఈ సినిమా నుంచి రోజుకొక అప్డేట్ ఇవ్వడంలో సినిమా యూనిట్ సక్సెస్ అవుతున్నారు.

Also Read: Kalki 2898 AD: కల్కి లో గూస్ బాంబ్స్ తెప్పించే సీన్స్ ఇవేనట…

కానీ ఆ అప్డేట్ జనాల్లోకి చేరిందా లేదా ఒకవేళ చేరకపోతే మనం ప్రమోషన్స్ ద్వారా దాన్ని జనాల్లోకి తీసుకెళ్దాం అనే ప్రణాళికలు అయితే వీళ్ళు రూపొందించుకోలేదు. ఇక దాని ఇంపాక్ట్ మిగితా రాష్ట్రాల టికెట్ బుకింగ్ విషయంలో తెలుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో టిక్కెట్లు సరిగ్గా బుక్ అవ్వడం లేదట. అదే ప్రమోషన్స్ చేసి ఉంటే సినిమా మీద ఇంకా బాగా హైప్ క్రియేట్ అయి సినిమా టిక్కెట్లు భారీగా సేల్ అయ్యేవని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…