Vastu Negative Energies: వాస్తు టిప్స్: ఇంట్లో ప్రతికూల శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు మూసేటప్పుడు శబ్ధం చేయకుండా చూసుకోవాలి. తలుపులు చప్పుడు చేస్తే దరిద్రమే. లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. ధన నష్టం కలుగుతుంది. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంటుంది. కాబట్టి తలుపులు మూసేటప్పుడు,

Written By: Srinivas, Updated On : June 2, 2023 11:28 am

Vastu Negative Energies

Follow us on

Vastu Negative Energies: మనం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం. ప్రతిది పక్కా వాస్తుప్రకారం ఉండేలా చూసుకుంటాం. అన్ని వాస్తు ప్రకారం లేకపోతే ప్రతికూల ప్రభావాలు రావడం సహజం. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఈ నేపథ్యంలో వాస్తు ఇంటికి సురక్షితమైన వాతావరణం కలగజేస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే మనకు ఇబ్బందులే వస్తాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ట్యాంక్ నుంచి కానీ బయట ఉన్న ట్యాంక్ నుంచి నీళ్లు లీకేజీ కాకూడదు. అలా జరిగితే మనకు ధన నష్టం సంభవిస్తుంది. కుళాయి నుంచి నీరు కారుతుంటే దాన్ని వెంటనే సరిచేసుకోండి. లేదంటే డబ్బులు కూడా అలాగే ఖర్చయిపోతాయి. నీళ్లు లీకైతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు. వెళ్లిపోతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు మూసేటప్పుడు శబ్ధం చేయకుండా చూసుకోవాలి. తలుపులు చప్పుడు చేస్తే దరిద్రమే. లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. ధన నష్టం కలుగుతుంది. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంటుంది. కాబట్టి తలుపులు మూసేటప్పుడు, తీసేటప్పుడు ఎలాంటి శబ్ధాలు రాకుండా చూసుకుంటేనే మంచిది.

బాత్ రూం కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం బాత్ రూం తడిగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇంటి పైకప్పు మీద అవసర వస్తువులు ఉంచకూడదు. దీంతో కూడా ప్రతికూల శక్తులు ఏర్పడే వీలుంటుంది. పైన ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువులు ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.