Pacha Karpuram : ఇదొక్కటి చాలు లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది. సైన్స్ పరంగా చూస్తే ఆరోగ్యం కూడా మెరుగేనట.

సంపదను ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంటుందట. పచ్చకర్పూరాన్ని ఓ పసుపు వస్త్రంలో మూట కట్టాలి. ఇంటికి కుబేర స్థానంలో దీన్ని ఉంచి ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోతాయి అంటున్నారు నిపుణులు. ఇక ఈ కర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టాలి. దీన్ని పూజగదిలో ఉంచి పూజ పూజిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Written By: Swathi Chilukuri, Updated On : August 27, 2024 7:57 pm

Pacha Karpuram

Follow us on

Pacha Karpuram: ఇంట్లోని దుష్టశక్తులను తొలగించుకోవడం కోసం పచ్చ కర్పూరాన్ని చాలా ఉపయోగపడుతుంది. పచ్చకర్పూరం నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో శ్రీలక్ష్మీ దేవి నివాసం వుంటుందని అంటున్నారు పండితులు. దేవుని పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు గాజు పాత్రలో నీటిని పోయాలి. అందులో పచ్చకర్పూరాన్ని అందులో వేసి.. పసుపును చిటికెడు కలపాలి. ఆ నీటిని రోజూ లేదా రెండు రోజులకు ఓసారి మార్చాలి చాలు ఇంట్లో ఉన్న దుష్టశక్తులు మొత్తం పరార్ అవుతాయి అంటున్నారు పండితులు.

సంపదను ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంటుందట. పచ్చకర్పూరాన్ని ఓ పసుపు వస్త్రంలో మూట కట్టాలి. ఇంటికి కుబేర స్థానంలో దీన్ని ఉంచి ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోతాయి అంటున్నారు నిపుణులు. ఇక ఈ కర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టాలి. దీన్ని పూజగదిలో ఉంచి పూజ పూజిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చకర్పూరం ఓ ముక్కను పేపర్లో మడత పెట్టి.. పర్సులో ఉంచుకోండి. దీనివల్ల మీకు ధనాదాయం పెరుగుతుంది అంటున్నారు పండితులు.

ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా సరే పచ్చకర్పూరం వెలిగించండి. మంచి ఫలితాలు వస్తాయి.అంతేకాదు వ్యాపారం చేసే ప్రాంతాల్లో, బీరువాల్లో పచ్చకర్పూరం ఉంచితే ఎలాంటి ఏడుపు ఉండదట. ఇక ఈ పచ్చకర్పూరాన్ని శ్రీ మహాలక్ష్మీ దేవి చిత్ర పటం ముందుగానీ లేదంటే ప్రతిమకు ముందు ఓ చిన్నపాటి బౌల్‌లో ఉంచితే చాలు సకల అభీష్టాలు సిద్ధిస్తాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇక పూజలకు మాత్రమే కాదు ఇది శరీరానికి కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. పచ్చకర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నోసమస్యలు తగ్గుముఖం పడతాయి. తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకుంటే శరీరంలో ఉన్న మొత్తం వేడి తగ్గుతుందట.

రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలతో బాధ పడేవారికి ఉపశమనం కలుగుతుంది. వీర్యవృద్ధి ఫెరుగతుంది. కర్పూరం తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుందట. ఇంట్లో వెలిగించే కర్పూరంతో సూక్ష్మక్రిములు, చిన్నచిన్న పురుగులు పరార్ అవుతాయి. వీటిని సులభంగా నశింపజేయవచ్చు. కాబట్టి ప్రతి రోజు ఈ కర్పూరాన్ని వెలిగించడం మంచిది. జ్వరం, దగ్గు సమస్యలను దూరం చేస్తాయి ఇవి. కర్పూరం సౌందర్యపోషణలోనూ ఎక్కువ పని చేసేలా చేస్తుంది.

నిమ్మరసంలో కర్పూరం కలిపి రాస్తే మొటిమలు మచ్చలు తగ్గుతాయి. నూనెలో కలిపి రాయడం వల్ల చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. నీటిలో కర్పూరం కలిపి స్నానం చేయడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. చలికాలంలో వేధించే జలుబు తగ్గాలంటే కొబ్బరినూనెలో కర్పూరాన్ని నానబెట్టి ఛాతి పై రాసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది. కప్పు నీటిలో కర్పూరం బిళ్లను వేసి ఉంచితే దోమలు పోతాయి. అంతేకాదు కర్పూరం బిల్లను నీటిలో వేసి మరిగించి ఫ్లోర్‌ని క్లీన్ చేస్తే ఈగలు దరిచేరవు. ఉన్న ఈగలు నశిస్తాయి.