
మనిషి జీవించడానికి కావాల్సిన అత్యవసరమైన వాటిలో నీరు కూడా ఒకటి. నీరు తాగకుండా మనిషి ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. మన శరీరంలో కూడా ఎక్కువ శాతం నీరే ఉంటుంది. మానవాళి మనుగడకు గాలి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నది నీటికి మాత్రమే. సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. అయితే ఆ ప్రాంతంలోని నీరు తాగితే మాత్రం మనుషులు చనిపోవడం గ్యారంటీ. ఇప్పటికే కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది.
Also Read : వామ్మో.. చైనా కరోనాతో ఇతర దేశాల ప్రజలను మోసం చేసిందా..?
ఒకవైపు గాలి ద్వారా కరోనా మహమ్మారి శరీరంలోకి ప్రవేశిస్తూ ఉండటంతో గాలి పీల్చాలంటేనే గజగజా వణికిపోతున్న మనకు నీటి రూపంలో కొత్త సమస్య మొదలైంది. అమెరికాలోని టెక్సాస్‌లో ట్యాప్ వాటర్ తాగిన వారు శరీరంలోకి భయంకరమైన సూక్ష్మజీవులు వెళ్లడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే ఆ సూక్ష్మ క్రిముల వల్ల చనిపోతున్నారు. నేగ్లెరియా ఫొలరీ అనే సూక్ష్మజీవి ప్రజల భయాందోళనకు కారణమవుతోంది.
తాజాగా ఆరేళ్ల బాలుడు ఈ సూక్ష్మజీవి వల్ల చనిపోవడంతో ఈ సూక్ష్మజీవిని సీరియస్ గా పరిగణించాల్సి వస్తోంది. అమీబా లాంటి సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించి మనిషి ప్రాణాలు పోవడానికి కారణమైందని తెలిసి అక్కడి అధికారులు ఆ నీటిని వినియోగించడంపై ఆంక్షలు విధించారు. ఆ నీటిని స్నానానికి వినియోగించినా ప్రమాదమని చెప్పారు. బ్రజోరియా కౌంటీలోని లేక్ జాన్సన్‌లోని ట్యాప్ వాటర్ ద్వారా సూక్ష్మజీవులు మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు అధికారులు తేల్చారు.
ఈ సూక్ష్మజీవులు ప్రవేశించిన వారిలో ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సూక్ష్మజీవి బారిన పడితే మెదడు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. గతంలోనే వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ సూక్ష్మజీవిని గుర్తించారు. శరీరంలోకి నీటి ద్వారా చేరిన ఈ సూక్ష్మజీవి రక్తంలో కలిసి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
Also Read : చైనాకు షాక్: సరిహద్దుల్లో నిశ్శబ్ధ మిసైల్ దించిన భారత్