
కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యం తో కొన్ని దేశలలో అత్యవసర కార్యక్రమం కింద ప్రయోగ దశలో వున్నా వాక్సిన్ లను ఇస్తున్న సంగతే తెలిసిందే. రష్యా కూడా ప్రయోగ దశలో వున్నా వాక్సిన్ ను ప్రజలకు ఇవ్వడం జరిగింది. రష్యాలో వున్న వైద్య నిపుణులు, ప్రపంచ దేశాలు ప్రజల ప్రాణాలతో రష్యా ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ వాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వాక్సిన్ మూడో ట్రయల్స్ లో భాగంగా 3000మందికి వాక్సిన్ ఇచ్చామని వారందరు ప్రస్తుతం క్షేమంగా వున్నారని వేరేవారికి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మాస్కో మేయర్ సెర్జీ సోబియానిన్ తెలిపారు.
Also Read : ఆకట్టుకుంటున్న మామాకోడళ్ల ముచ్చట్లు !