Soaked Peanuts : నానబెట్టిన వేరుశెనగలతో నమ్మలేనన్ని లాభాలు.. అవేంటంటే?

ప్రతి ఒక్కరూ ఆఫీస్‌లో రోజంతా కూర్చీలో వర్క్ చేయడం వల్ల వెన్నెముక కాస్త నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి నుంచి విముక్తి పొందాలంటే ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగ గింజలు తింటే విముక్తి కలుగుతుంది.

Written By: Kusuma Aggunna, Updated On : September 20, 2024 6:14 pm

Benefits of boiled peanuts

Follow us on

Soaked Peanuts : కొందరు నల్ల శనగలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే కేవలం నల్ల శనగలను మాత్రమే కాకుండా వేరశెనగలను కూడా నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని సామాన్యుల జీడిపప్పు అని కూడా అంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. డ్రైఫూట్స్ కొనలేని వాళ్లు వీటిని డైలీ తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రోజుకి గుప్పెడు వేరుశెనగ గింజలను నానబెట్టి తింటే శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. వీటివల్ల మంచి కొలెస్ట్రాల్ బాడీలోకి చేరుతుంది. బక్కగా ఉన్నవాళ్లకి బరువు పెరగడంలో వేరుశెనగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మీకు నమ్మలేనన్ని లాభాలు ఉన్నాయి. అవేంటో మరి తెలుసుకుందాం.

వర్క్‌వుట్‌లు చేసేవాళ్లు
చాలామంది జిమ్‌కి వెళ్తు.. బాడీ బిల్డింగ్‌లు చేస్తుంటారు. అలాంటి వాళ్లకి నానబెట్టిన వేరుశెనగ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కండరాలు బలంగా పెరుగుతాయి. కేవలం నానబెట్టిన వేరుశెనగ గింజలను మాత్రమే కాకుండా మొలకలు ఉన్న వేరుశెనగ గింజలను కూడా తినవచ్చు. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

జీర్ణక్రియకి మేలు చేస్తుంది
రాత్రి నానబెట్టిన వేరుశనగ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తినే ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, జీర్ణ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది
క్రమం తప్పకుండా రోజూ పల్లీలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగు పడుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సాయపడుతుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది
ఈరోజుల్లో చాలామంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వేరుశెనగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు శరీరంలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో బాగా సాయపడతాయి. చాలామంది అండాశయ, రొమ్ము, పెద్దప్రేగు వంటి క్యాన్సర్లతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి కాపాడటంలో వేరుశెనగ గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

గ్యాస్టిక్ సమస్యలను తగ్గిస్తుంది
కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లకి నానబెట్టిన వేరుశెనగ గింజలు బాగా ఉపయోగపడతాయి. పరగడుపున వీటిని తినడం వల్ల కడుపులోని ఆమ్లత్వం తగ్గుతుంది.

వెన్నెముక ఆరోగ్యం
ప్రతి ఒక్కరూ ఆఫీస్‌లో రోజంతా కూర్చీలో వర్క్ చేయడం వల్ల వెన్నెముక కాస్త నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి నుంచి విముక్తి పొందాలంటే ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగ గింజలు తింటే విముక్తి కలుగుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.