Brush : బ్రష్ ఎంత సేపు చేయాలి? రోజులో ఎన్నిసార్లు చేయాలంటే?

పొద్దున్న ఎలాంటి పని లేదని నిద్రలేచిన వెంటనే ఎక్కవ సమయం పళ్లు తోముతుంటారు. ఇలా చేయడం అసలు మంచిది కాదు. బ్రష్ అనేది కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే చేయడం ఆరోగ్యానికి మంచిది. అంత కంటే ఎక్కువ సమయం చేస్తే పళ్లపై ఉండే ఎనామిల్ పొర తగ్గిపోతుంది.

Written By: NARESH, Updated On : September 20, 2024 6:16 pm

How long should you Brush and how many times a day

Follow us on

Brush : ఉదయం లేచిన వెంటనే అందరూ మొదట చేసే పని బ్రష్ చేయడం. లేచిన వెంటనే ఇలా చేయడం వల్ల బద్దకం అన్ని పోయి చాలా ఫ్రెష్‌గా ఉంటారు. అయితే బ్రష్ అనేది రోజూ సరిగ్గా చేయాలి. ఒక్కరోజు బ్రష్ చేయకపోయిన నోటిలో బ్యాక్టీరియా ఉండిపోతుంది. దీంతో దంత సమస్యలు వస్తాయి. అలాగే వీటితో పాటు పళ్లు చిగుళ్ల మధ్య నొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమూ.. దంత ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే కొందరికి బ్రష్ చేయడం నచ్చకపోవడం వల్ల పూర్తిగా చేయరు. మరికొందరు దంతాలు బాగా మెరిసిపోవాలని ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు. ఎంత ఎక్కువ పళ్లు తోముకుంటే దంతాలు అంత తెల్లగా అవుతాయని ఉద్దేశించి ఎక్కువ సమయం చేస్తారు. ఇలా ఎక్కువ సమయం బ్రష్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

పొద్దున్న ఎలాంటి పని లేదని నిద్రలేచిన వెంటనే ఎక్కవ సమయం పళ్లు తోముతుంటారు. ఇలా చేయడం అసలు మంచిది కాదు. బ్రష్ అనేది కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే చేయడం ఆరోగ్యానికి మంచిది. అంత కంటే ఎక్కువ సమయం చేస్తే పళ్లపై ఉండే ఎనామిల్ పొర తగ్గిపోతుంది. దీంతో దంత సమస్యలు వస్తాయి. సాధారణంగా అందరూ రోజుకి ఒకసారే బ్రష్ చేస్తారు. అయితే రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు బ్రష్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. నిద్రపోయే ముందు, నిద్రలేచిన తర్వాత బ్రష్ చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాకపోతే ఎక్కువ సమయం బ్రష్ చేయకుండా తక్కువ సమయం మాత్రమే చేయాలి. రెండు కంటే ఎక్కువ సార్లు బ్రష్ చేస్తే పళ్ల మధ్యలో గ్యాప్ వస్తుందని, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే చాలామంది బ్రష్‌కి బదులు మౌత్ వాష్‌లు వాడుతుంటారు. వీటివల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది. అలాగే నోటిలో పళ్ల మధ్య ఉండే ఏవైనా చిన్న పదార్థాలను కూడా తొలగించుకోవచ్చు.

కొందరు స్మూత్‌గా ఉండే బ్రష్ వాడకుండా.. హార్డ్‌గా ఉండే బ్రష్ వాడుతారు. దీనితో బ్రష్ చేసేటప్పుడు దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొందరగా తొలగిపోతుంది. కాబట్టి బ్రష్ కొంచెం స్మూత్‌గా ఉండేలా చూసుకోండి. భోజనం చేసిన తర్వాత లేదా ఏదైనా ఆహారం తిన్న వెంటనే నోటిలో కాస్త నీరు వేసి పుక్కిలించాలి. అప్పుడు చిగుళ్లలో ఉండే ఆహారం అంతా బయటకు వస్తుంది. దీనివల్ల నోటిలో ఎలాంటి సమస్యలు రావు. బాగా చల్లని పదార్థాలు, చల్లని నీరు అధికంగా తీసుకోవద్దు. చల్లగా ఉండే పదార్థాల వల్ల పళ్ల నొప్పి వస్తుంది. కాబట్టి దంతాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అప్పుడప్పుడు దంత డాక్టర్ దగ్గరకు వెళ్లి నోరు మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల కాస్త వరకు దంతాల సమస్య నుంచి బయటపడవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.