https://oktelugu.com/

Greece : ప్రపంచంలోనే అత్యధికంగా ఆ పని చేసే దేశం ఏదో తెలుసా?

ఇద్దరు వ్యక్తుల మధ్య కలయిక ఏర్పడిన సమయంలో అక్కడ జరిగే క్రియ వల్ల ఇద్దరి మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. భార్యభర్తల మధ్య నిత్యం శృంగారం వల్ల కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. అయితే ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఏ దేశంలో ఎక్కువ శృంగారం చేస్తారో తేలిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2024 5:07 pm
    Greece

    Greece

    Follow us on

    Greece : నిత్యం ఉరుకులు పరుగులు.. బిజీ వాతావరణం.. విధులు, ఇతర పనుల కారణంగా టెన్షన్ లైఫ్.. నేటి కాలంలో ప్రతి వ్యక్తిలో ఉంటున్నాయి. దీంతో ఉల్లాసమైన వాతావరణాన్ని కోరుకునేందుకు చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో వినోద కార్యక్రమాలు, మద్యపానం వంటికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. ఇదే కోవలో శృంగారం ద్వారా కూడా ఉల్లాసమైన వాతావరణాన్ని పొందవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య కలయిక ఏర్పడిన సమయంలో అక్కడ జరిగే క్రియ వల్ల ఇద్దరి మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. భార్యభర్తల మధ్య నిత్యం శృంగారం వల్ల కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. అయితే ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఏ దేశంలో ఎక్కువ శృంగారం చేస్తారో తేలిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

    శృంగారం ఆరోగ్య కరమని వైద్యులు చెబుతుంటారు. క్రమం తప్పకుండా ప్రణాళితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. శృంగారం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. కేలరీలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తారు. వారానికి కనీసం ఒక్కసారైనా ఇందులో పాల్గొనాలని కొన్ని సర్వేలు ఇప్పటికే ప్రకటించాయి. వీలు కాకపోతే కనీసం నెలలో కొన్ని సార్లు అయినా శృంగారం చేయాలని నిపుణులు అంటున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం అత్యధికంగా శృంగారం చేస్తున్నట్లు తేలింది.

    డ్యూరెక్స్ లైంగిక సంక్షేమ సర్వే , ఫేస్ ఆఫ్ గ్లోబల్ శృంగారం అనే సంస్థలు కలిసి 26 దేశాల్లో సర్వే నిర్వహించారు. ఏయే దేశాల్లో ఎలా శృంగారంలో పాల్గొంటున్నారో వారు కనుగొన్నారు. వీరి సర్వేలో తేలిందేమిటంటే.. గ్రీస్ అనే దేశంలో 87 శాతం శృంగారంలో పాల్గొంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఈ దేశంలోనే ఇద్దరు వ్యక్తుల కలయిక ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత బ్రెజిల్ లో 82 శాతం మంది శృంగారంలో పాల్గొంటున్నారు. ఆ తరువాత రష్యా 80 శాతం, చైనా 78 శాతం, ఇటలీ 76 శాతంతో తరువాత స్థానాలు కలిగి ఉన్నాయి. అమెరికా విషయానికొస్తే ఈ దేశంలో మొత్తంగా 52 శాతం మాత్రమే పాల్గొంటారని తేలింది. దీంతో ఈ దేశం 25వ స్థానంలో ఉంది. అయితే భారత్ ఎన్నో స్థానంలో ఉందో మాత్రం తెలియజేయలేదు.

    శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందువల్ల సమయంల దొరికినప్పుడల్లా ఆయా దేశాల్లో మిగతా పనుల కంటే వీటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే డ్యూరెక్స్ లైంగిక సంక్షేమ సర్వే , ఫేస్ ఆఫ్ గ్లోబల్ శృంగారం సంస్థలు చేసిన సర్వే వారం రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత ఆయా దేశాల పరిస్థితి మారిపోతుందని సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సర్వేలో మొత్తం 26 వేల మందికి పైగా వ్యక్తులను తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుడా ఈ సర్వేలో 16 ఏళ్లకు పైబడిన వారిని తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.