Ugadi Pachhadi: ఉగాది పండుగ అనగానే పచ్చడి గుర్తుకు వస్తుంది. ఈరోజు ఆరు రుచులు కలిగిన పచ్చడిని తయారు చేసి ఇంటిల్లిపాది తాగుతారు. కొన్ని సంస్థలు, కార్యాలయాలు దీనిని తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు,చేదు అనే ఆరు రుచులు కలుస్తాయి. ఆరు రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి తాగడం వల్ల రుచిని మాత్రమే అనుభూతిని పొందుతారని కొందరు భావిస్తారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం..
శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది. ఈ సమయంలో అనేక ఆరోగ్య ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి నుంచి కాపాడుకునేందుక పూర్వ కాలంలో ఉగాది పచ్చడిని తయారు చేశారని కొందరు చెబుతుంటారు. ఇందులో ఉన్న ఆరు పదార్థాలు ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడిలో బెల్లం, వేప పువ్వు వేస్తుంటారు. ఈ రెండు మిశ్రమాల వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. వేప పువ్వులు ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తాయి.
బరువు తగ్గాలని ఇటీవల కొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వేప పువ్వు, బెల్లం కలిపిన మిశ్రమం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. కొవ్వును కాల్చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు ఉగాది పచ్చడి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఉగాది సమయంలో వేసవి కాలం ప్రారంభమవుతుంది. దీంతో డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి బెల్లం నీరు తీసుకోవడం ఎంతో మంచింది. అందువల్ల ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల వడదెబ్బ సమస్య నుంచి తట్టుకోవచ్చు. ఉగాది పచ్చడిలో కొత్త మామిడి ముక్కలు వేస్తారు. దీని వల్ల ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే శక్తి వస్తుంది. ఇవే కాకుండా అజీర్ణం, డీ హైడ్రేషన్ తదితర ఆరోగ్య సమస్యల నుంచి ఉగాది పచ్చడి కాపాడుతుంది.